Site icon NTV Telugu

Nara Lokesh: ఏపీలో మరో భారీ పెట్టుబడి.. రూ.82 వేల కోట్లు ఇన్వెస్ట్‌ చేయనున్న రెన్యూ పవర్‌..!

Nara Lokesh

Nara Lokesh

Nara Lokesh: ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిష్టాత్మక సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి.. ఇప్పటికే గూగుల్‌ లాంటి సంస్థ ఏపీలో భారీ పెట్టుబడి పెట్టడం.. దీనికి సంబంధించి ఎంవోయూ కూడా జరిగిపోయిన విషయం విదితమే కాగా.. ఇప్పుడు రెన్యూ పవర్‌ అనే సంస్థ.. ఏపీలో భారీ పెట్టుబడి పెట్టుందుకు ముందుకు వచ్చింది.. రెన్యూ పవర్‌ సంస్థ ఆంధ్రప్రదేశ్‌లో రూ.82వేల కోట్ల పెట్టుబడులు పెట్టనుంది అని వెల్లడించారు మంత్రి నారా లోకేష్‌.. ఈ మేరకు ట్వీ్‌ట్‌ చేశారు (ఎక్స్‌లో పోస్టు) పెట్టారు మంత్రి నారా లోకేష్‌.. ఐదేళ్ల తర్వాత మళ్లీ రాష్ట్రంలో రెన్యూ పవర్‌ సంస్థ అడుగుపెట్టనుంది.. గ్రీన్‌ ఎనర్జీ రంగంలో భారీ ప్రాజెక్టులను ఆ సంస్థ నెలకొల్పనుంది.. అంటూ ట్వీట్‌ చేశారు నారా లోకేష్..

Read Also: Jigris Movie Review: జిగ్రీస్ మూవీ రివ్యూ.. హీరోయిన్, గ్లామర్ డోస్ లేని సినిమా ఎలా ఉందంటే?

ఆంధ్రప్రదేశ్ నుండి వైదొలిగిన ఐదేళ్ల తర్వాత, ఆంధ్రప్రదేశ్‌లోని మొత్తం పునరుత్పాదక ఇంధన విలువ చైన్‌పై రెన్యూ పవర్‌ సంస్థ పెట్టుబడి పెడుతోందని ప్రకటించడం నాకు గర్వకారణం అని పేర్కొన్నారు నారా లోకేష్‌… రూ. 82,000 కోట్ల పెట్టుబడితో, రెన్యూ పవర్‌ సంస్థ.. సోలార్ ఇంగోట్, వేఫర్ తయారీ, ప్రాజెక్ట్ అభివృద్ధి వరకు తర్వాత గ్రీన్ హైడ్రోజన్ మరియు అణువుల వరకు హై టెక్నాలజీ రంగాలలో పెట్టుబడి పెడుతుందని వెల్లడించారు.. ఇక, వైజాగ్‌లో జరిగే CII భాగస్వామ్య శిఖరాగ్ర సమావేశానికి.. రెన్యూ పవర్‌ సంస్థ ఫౌండర్‌, చైర్మన్ అండ్‌ సీఈవో సుమంత్ సిన్హా.. మరియు రెన్యూ పవర్‌ సంస్థ ప్రతినిధులు పాల్గొంటారని ట్వీట్‌లో పేర్కొన్నారు మంత్రి నారా లోకేష్‌.. కాగా, ఏపీకి మరో భారీ పెట్టుబడి వస్తుంది.. రేపు ఉదయం 9 గంటలకు వెల్లడిస్తానంటూ బుధవారం రోజు ట్వీట్‌ చేసిన మంత్రి నారా లోకేష్‌.. ఈ రోజు.. ఆ పెట్టుబడికి సంబంధించిన వివరాలను వెల్లడిస్తూ.. మరో ట్వీట్ చేశారు..

Exit mobile version