NTV Telugu Site icon

Swarna Andhra @ 2047 portal: ఏపీ అభివృద్ధికి సూచనలు, సలహాల స్వీకరణ.. ప్రత్యేక పోర్టల్‌ ఏర్పాటు..

Ap

Ap

Swarna Andhra @ 2047 portal: ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి కోసం ప్రజల నుంచి సూచనలు, సలహాలు స్వీకరిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం.. దీని కోసం ప్రత్యేక పోర్టల్‌ ఏర్పాటు చేసింది.. ప్రజల నుంచి సలహాల స్వీకరణ కోసం స్వర్ణాంధ్ర @ 2047 పేరుతో పోర్టల్ ఏర్పాటు చేశారు.. ఏపీ అభివృద్ధి సలహాల కోసం పోర్టల్ ప్రారంభించింది ప్రణాళిక విభాగం. సూచనలు చేసిన వారికి అప్రిసియేషన్ సర్టిఫికెట్ కూడా ఇస్తోంది ప్రభుత్వం.. ఇక, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర చేసేలా సలహాలివ్వాలి అంటూ ట్వీట్‌ చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..

Read Also: Ramajogaiah Sastry: జూనియర్ ఎన్టీఆర్ అభిమానికి దండం పెట్టిన రామజోగయ్య శాస్త్రి

2047 నాటికి 2.4 ట్రిలియన్ల డాలర్ల GSDP మరియు 43,000 డాలర్ల కంటే ఎక్కువ తలసరి ఆదాయంతో భారతదేశాన్ని నడిపించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు పేర్కొన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు.. స్వర్ణాంధ్రదేశ్ @ 2047 వైపు ఈ ప్రయాణాన్ని ప్రారంభించాం. అభివృద్ధి బాటలో ఏపీని తీసుకెళ్లడానికి ప్రజలు సూచనలు చేయాలని కోరారు.. ప్రతి ఒక్కరి ఆలోచన ముఖ్యమైనదే.. ప్రతి సూచనను పరిగణనలోకి తీసుకుంటాం. అందరం కలిసి ఏపీని నిర్మించుకుందాం అంటూ సోషల్‌ మీడియా వేదికగా పిలుపునిచ్చారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..