NTV Telugu Site icon

CM and Deputy CM: పవన్‌ కల్యాణ్‌ చర్యలు తీసుకోవాలి.. సీఎం సూచన..

Babu 2

Babu 2

CM and Deputy CM: ఏపీ సచివాలయంలో కలెక్టర్ల కాన్ఫరెన్స్‌ కొనసాగుతోంది.. అయితే, ప్రాథమిక రంగంపై అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు.. వచ్చే వందరోజుల్లో తాము చేపట్టబోయే కార్యక్రమాలను వివరించారు వ్యవసాయ, ఆక్వా, ఫిషరీస్, ఉద్యానవనం, అటవీ శాఖల అధికారులు. ఇక, భారీ ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనలు చేశారు.. మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టేలా భాద్యత తీసుకోవాలని కోరారు ఏపీ సీఎం.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అటవీ సంపదను పెంచాలి. వనభోజనాలకు మనందరం వెళ్లాలి. భారీ ఎత్తున చెట్లు నాటే కార్యక్రమం చేపట్టాలి. ఒకేసారి ఐదు లక్షలు.. పది లక్షల చెట్లు నాటేలా వన మహోత్సవాలను కార్యక్రమం చేపట్టాలి.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ ఈ మేరకు చర్యలు తీసుకోవాలన్నారు.. గతంలో హైదరాబాద్ లో భారీ ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాం.. 20 లక్షల హెక్టార్లలో 20 లక్షల మంది రైతులతో నేచురల్ ఫార్మింగ్ కు వెళ్తున్నాం. హై ప్రోటీన్ ప్యాడీ విషయంలో ఇప్పుడు డిమాండు ఉంది.. దీన్ని గుర్తుపెట్టుకోవాలి.. ఎక్కడికక్కడ సాయిల్ టెస్టింగ్ చేయాలి. ప్రతి రంగంలోనూ సాంకేతికతను ఉపయోగించుకోవాలి.. గత ప్రభుత్వ విధానాల వల్ల ఫైబర్ నెట్ పరిస్ధితి ఏంటో తెలియడం లేదు, సీసీ కెమెరాలు ఎక్కడున్నయో క్లారిటీ లేదు. ఫైబర్ నెట్ ఇంటిగ్రేషన్ సీసీ కెమెరాల స్టేటస్ వివరించాలి.

Read Also: Supreme Court : విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నాయి..కోచింగ్ సెంటర్లపై సుప్రీం సీరియస్

Show comments