Site icon NTV Telugu

PMAY Grameen 2.0 Scheme: పీఎంఎవై గ్రామీణ్ 2.0 స్కీమ్‌పై గుడ్‌న్యూస్‌ చెప్పిన సర్కార్..

Ap Govt

Ap Govt

PMAY Grameen 2.0 Scheme: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. పీఎంఎవై గ్రామీణ్ 2.0 పథకం కింద నిర్మించే ఇళ్ల యూనిట్ ధరను ర.2.39 లక్షలుగా రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ యూనిట్ కాస్ట్‌లో భాగంగా కేంద్రం మరియు రాష్ట్రం భరించాల్సిన మొత్తాలను, లబ్ధిదారులకు మంజూరు చేయాల్సిన రాయితీలను, వివిధ భాగాలను వివరంగా నిర్ణయించారు.

యూనిట్ కాస్ట్ వివరాలు
మొత్తం యూనిట్ కాస్ట్: రూ.2.39 లక్షలు
కేంద్రం భరించాల్సిన మొత్తం: రూ.95,400
రాష్ట్రం భరించాల్సిన మొత్తం: రూ.63,600

ఇతర మంజూరులు
ఇక, ఎస్ హెచ్ జీ సభ్యులకు 3 శాతం వడ్డీ రాయితీతో రూ.80,000.. జి రామ్ జీ కన్వర్జెన్స్ కింద ఒక్కో లబ్ధిదారుకు రూ.27,000.. ఎస్ బీపీఎం (గ్రామీణ్)–ఐ హెచ్ హెచ్ ఎల్ కింద ఒక్కో లబ్ధిదారుకు రూ.12,000 అందజేయనున్నారు.. రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకంలో వచ్చే తదుపరి చర్యలను పరిశీలించి అమలు చేయాలని హౌసింగ్ ఎండీకి ఆదేశించింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ హౌసింగ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌ జైన్ ఆదేశాలు జారీ చేశారు.

Exit mobile version