PHC Doctors Agitation: ఏపీలో PHC డాక్టర్ల నిరసన నిరాహారదీక్షగా మారింది.. మొత్తం 5 ప్రధాన డిమాండ్లతో నిరసన దీక్ష చేపట్టారు PHC డాక్టర్లు.. అయితే, PHC డాక్టర్లు సమ్మె విరమించాలని, వారి డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని, అవకాశాన్ని బట్టి డిమాండ్లు పరిష్కరిస్తామని మంత్రి సత్యకుమార్ యాదవ్ హామీ ఇస్తూ ప్రెస్ రిలీజ్ ఇచ్చారు.. ఇదే నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ వీరపాండ్యన్, డైరెక్టర్ పద్మావతి PHC డాక్టర్లతో చర్చలు జరిపారు.. మొదటి విడత చర్చల్లో డాక్టర్ల డిమాండ్లలో ఇన సర్వీసు కోటా 20 శాతం అన్ని స్పెషాలిటీలకు ఇస్తూ, ఒక సంవత్సరం మాత్రమే అవకాశం ఇస్తామనడంతో PHC డాక్టర్లు ససేమిరా అంటూ వెనుదిరిగారు..
Read Also: IND vs PAK: అటు అబ్బాయిలు, ఇటు అమ్మాయిలు.. పాపం భారత్ డామినేషన్‌ను తట్టుకోలేకపోతున్న పాకిస్థాన్..
PHC డాక్టర్లతో కమిషనర్ వీరపాండ్యన్ జరిపిన చర్చలు మొదటి విడత ఫెయిల్ కావడంతో, మరోమారు పిలిచారు.. అన్ని డిమాండ్లకు సానుకూలంగా స్పందించిన ప్రభుత్వ అధికారులు, ఇన్ సర్వీసు కోటాపై మరోసారి చర్చించారు.. 20 శాతం ఇన్ సర్వీసు కోటా ఇస్తూ, ఐదు సంవత్సరాల పాటు అవకాశం కల్పించాలని PHC డాక్టర్లు ప్రతిపాదిస్తున్నారు.. అయితే, ఇప్పటికే భారీ సంఖ్యలో ఇన్ సర్వీసు PGలు వస్తుండటంతో, రెండేళ్ల తరువాత మరో మూడు సంవత్సరాల వరకూ ఖాళీలు ఉండవని అంటున్నారు అధికారులు.. ఇప్పటికే ఇన్ సర్వీసు PG చేసిన వారిని తీసుకోవాల్సి ఉండగా, అదనంగా ఇన్ సర్వీసు PG వారు వస్తే అవకాశాలుండవని అధికారులు అంటున్నారు.. నవంబర్‌లో మరోసారి భవిష్యత్ కార్యాచరణపై చర్చిద్దామని అంటున్నా, PHC డాక్టర్లు సమ్మె చేస్తున్నారని, అర్ధం చేసుకోవాలని అధికారులు అంటున్నారు. రానున్న మూడేళ్లలో సుమారు వెయ్యి మంది ఇన్-సర్వీస్ కోటా పీజీలు విధుల్లో చేరతారు… ఈ ఏడాది నవంబరు నుంచి దశల వారీగా వీరు విధుల్లోనికి వస్తారు.. దీనివల్ల 2027లో డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ అసుపత్రుల్లో, 2028 నుంచి బోధనాసుపత్రల్లో ఖాళీలు ఉండవు.. ఆకస్మికంగా మారిపోయే ఆదేశాలు, G.Oలు, అర్జెంట్ రివ్యూలు, ఇతర విభాగాల జోక్యాలు వలన గ్రామీణ వైద్యులపై అనవసర ఒత్తిడి పడుతోందని అంటున్నారు.. సమ్మె మన స్వార్థం కోసం కాదు. ఈ వ్యవస్థను సరిచేసి గ్రామీణ ప్రజలకు మంచి ఆరోగ్యసేవలు అందించాలన్న ఆత్మీయ ప్రయత్నం అంటున్నారు PHC వైద్యులు.. ప్రభుత్వ అధికారులు ఎన్ని చర్చలు జరిపినా, PHC వైద్యుల డిమాండ్లు నెరవేరక పోవడంతో, నిరాహారదీక్ష కొనసాగిస్తున్నారు.
Read Also: Minor’s Drug Party: మొయినాబాద్ ఫామ్ హౌస్లో మైనర్ల గంజాయి పార్టీ..
మొత్తంగా ఏపీలో PHC డాక్టర్ల రిలే నిరాహారదీక్ష కొనసాగుతుంది.. ప్రధానంగా 5 డిమాండ్లపై పట్టుపడుతున్నారు PHC డాక్టర్లు.. 20 శాతం PG ఇన్ సర్వీసు కోటా అన్ని స్పెషాలిటీలలో 5 సంవత్సరాలకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే, ఒక సంవత్సరానికే పరిమితం చేసింది ప్రభుత్వం.. 330 మంది PG ఇన్ సర్వీసు వైద్యులు అదనంగా ఉంటారంటుంది ప్రభుత్వం.. జీవో 99ను తొలగించడం ద్వారా న్యాయం చేయాలంటున్నారు PHC వైద్యులు.. PG ఇన్ సర్వీసు కోటాపై సందిగ్ధత కొనసాగుతుంది.. PHC వైద్యులు సమ్మె విరమించాలని కోరారు వైద్య ఆరోగ్య శాఖామంత్రి సత్యకుమార్ యాదవ్..
