AP Fuel Crisis: తగ్గిన పెట్రోల్ డీజిల్ కొరత ప్రభావం.. లిమిట్ పెంచిన బంక్‌లు..
- ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరత ప్రభావం తగ్గుముఖం..
- పలు జిల్లాల్లో ఇంధన సరఫరా సాధారణ స్థితికి..
- పెట్రోల్ బంకుల వద్ద తగ్గిన రద్దీ..
- కిలోమీటర్ల క్యూలకు ముగింపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Fuel Crisis: ఆంధ్రప్రదేశ్‌లో గత రెండు రోజులుగా తీవ్రంగా కనిపించిన పెట్రోల్, డీజిల్ కొరత ప్రభావం క్రమంగా తగ్గుముఖం పడుతోంది. ముఖ్యంగా విజయవాడ నగరంలో పెట్రోల్ బంకుల వద్ద పరిస్థితి సాధారణ స్థితికి చేరుతోంది. నిన్న, మొన్నటి వరకు కిలోమీటర్ల మేర కనిపించిన వాహనాల క్యూలు ఇప్పుడు గణనీయంగా తగ్గాయి. ఇప్పటికే ఆయిల్ కంపెనీలు అదనపు ట్యాంకర్ల ద్వారా ఇంధన సరఫరాను పెంచడంతో పలు జిల్లాల్లో పరిస్థితి మెరుగుపడుతోంది. పెట్రోల్ బంకుల వద్ద రద్దీ తగ్గిపోవడంతో వాహనదారులు ఊరట చెందుతున్నారు.
Read Also: Telangana SSC 10th Results: పది ఫలితాలపై బిగ్ అప్డేట్.. రిజల్ట్స్ డేట్ ఫిక్స్..
Also Read
- RK Roja: స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలి.. ప్రతిచోటా పోటీ చేస్తాం..
- YS Jagan: వ్యవస్థలన్నీ కుప్పకూలాయి.. ప్రతి ఇంట్లో వైసీపీ, కూటమి పాలనపై చర్చ జరుగుతోంది..
- YS Jagan: ఏకగ్రీవాలకు అంగీకరిస్తే వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఉండవు.. వైసీపీ నేతలకు జగన్ హెచ్చరిక
- Supreme Court: X, ఫేస్బుక్, ఇన్‌స్టా, యూట్యూబ్ పోస్టుల తొలగింపుపై వైసీపీ పిటిషన్.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
నిన్నటివరకు నాలుగు చక్రాల వాహనాలకు రూ.1500 వరకు మాత్రమే పెట్రోల్ ఇచ్చే పరిమితి ఉండగా, ఈరోజు దానిని రూ.2000కు పెంచారు. అలాగే రెండు చక్రాల వాహనాలకు రూ.500 వరకు ఇంధనం అందిస్తున్నారు. ఇక, గతంలో గంటన్నరకు పైగా క్యూలో నిలబడి పెట్రోల్ కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉండగా, ప్రస్తుతం కేవలం 10 నిమిషాల్లోనే ఇంధనం లభిస్తోందని వాహనదారులు చెబుతున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో ఇంధన సరఫరా సాధారణ స్థితికి చేరుకుంటోందని అధికారులు తెలిపారు. బంకుల వద్ద ‘నో స్టాక్ బోర్డ్స్’ లేకుండా చూడాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. మొత్తానికి పెట్రోల్, డీజిల్ కొరతతో ఇబ్బందులు పడ్డ ప్రజలకు ఇప్పుడు కొంత ఊరట లభిస్తోంది. రానున్న రోజుల్లో సరఫరా పూర్తిగా సాధారణ స్థితికి చేరుతుందని అధికారులు భావిస్తున్నారు. అయితే, రియాల్టీలోకి వస్తే ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయనే వార్తలు వస్తున్నాయి.. ఆ ప్రాంతాల్లో కూడా పెట్రోల్ కష్టాలకు చెక్ పెట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.. కాగా, పెట్రోల్, డీజిల్ కొరత వార్తల నేపథ్యంలో.. సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు పరిస్థితిపై ఆరా తీస్తున్నారు.. ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు..
తాజావార్తలు
-
Mohan Bhagwat: ఆర్ఎస్ఎస్ చీఫ్ న్యూయార్క్ ఈవెంట్.. మమ్దానీపై యూఎస్ సింగర్ ఘాటు వ్యాఖ్యలు..
-
Kriti Sanon: రాహుల్‌గాంధీ-కంగనా మాటల యుద్ధం.. కృతి సనన్ రక్షాబంధన్ యాడ్ తొలగింపు
-
Konda Murali : కాంగ్రెస్‌ను వీడేది లేదు, వివాదంతో నాకు సంబంధం లేదు.. కొండా మురళి సంచలనం
-
Yash’s Toxic: యశ్‌కి అగ్నిపరీక్ష.. ‘టాక్సిక్’ ముందు ఏకంగా రూ.1000 కోట్ల టార్గెట్!
-
YS Jagan: ‘సీఎంగా ఏం చేస్తున్నా’ అని చంద్రబాబు ప్రశ్నించుకోవాలి.. వైఎస్ జగన్ ఫైర్!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..