Deputy CM Pawan Kalyan: తన పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తనను పలకరించి, శుభాకాంక్షలు తెలియజేసి, ప్రేమాభిమానాలు చూపించిన ప్రతి ఒక్కరి ఆప్యాయతకు కృతజ్ఞుడినని పేర్కొన్నారు. ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు, సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు, భారత్ నలుమూలల నుంచి శుభాకాంక్షలు తెలిపిన అభిమానులు, శ్రేయోభిలాషుల ప్రేమ, అభిమానానికి పవన్ కల్యాణ్ ధన్యవాదాలు తెలిపారు. వారి ఆప్యాయత తనను ఎంతో వినమ్రతకు గురిచేసిందని అన్నారు.
జనసేన పార్టీ నాయకులు, కూటమి భాగస్వాములు, ప్రతి జనసైనికుడు, అభిమాని, మద్దతుదారు తన పుట్టినరోజును ఎంతో ప్రేమతో, ఉత్సాహంతో జరుపుకున్నారని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. తనపై వారు చూపించిన అభిమానానికి కృతజ్ఞతలు చెప్పడానికి తగినంత మాటలు తన వద్ద లేవని అన్నారు. జనసైనికులు, అభిమానులతో ఏర్పడిన ఈ అనుబంధాన్ని తాను ఎంతో విలువైనదిగా భావిస్తున్నానని తెలిపారు. తనకు వచ్చిన శుభాకాంక్షలను వినమ్రతతో, కృతజ్ఞతతో స్వీకరిస్తున్నానని పవన్ కల్యాణ్ అన్నారు. అదే సమయంలో ప్రజలు తనపై ఉంచిన నమ్మకంతో మరింత బాధ్యతగా పనిచేయాల్సిన అవసరాన్ని ఈ ప్రేమాభిమానాలు గుర్తు చేస్తున్నాయని పేర్కొన్నారు.
తనపై ప్రజలు చూపించే ప్రేమ కేవలం వేడుకల్లో మాత్రమే కాకుండా, తనతో పాటు ముందుకు తీసుకెళ్లే బాధ్యతగా భావిస్తున్నానని పవన్ కల్యాణ్ తెలిపారు. ప్రజా జీవితంలోనూ, వ్యక్తిగత జీవితంలోనూ తనపై ఉంచిన విశ్వాసానికి తగినట్టుగా వ్యవహరించాల్సిన బాధ్యతను ఈ అభిమానం మరింత పెంచుతుందని అన్నారు. తన పుట్టినరోజున శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు చెబుతూ.. ప్రజలు, అభిమానులు అందించే ప్రేమ ఎప్పటికీ తనకు బలంగా నిలుస్తుందని పేర్కొన్నారు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..
https://x.com/PawanKalyan/status/2095160768971051311

