Pawan Kalyan: నీట్ నిరసనలపై పవన్ కీలక వ్యాఖ్యలు.. విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan: నీట్ (NEET) పరీక్షలకు సంబంధించిన ఆందోళనలపై జనసేన పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పందించారు. విద్యార్థుల సమస్యలతో ప్రారంభమైన ఈ ఆందోళనను కొందరు విభజనవాద, దేశ వ్యతిరేక శక్తులు దారి మళ్లించేందుకు ప్రయత్నించాయని ఆయన ఆరోపించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో జరిగే నిరసనలను హింసాత్మకంగా మార్చే చర్యలు ఆందోళనకరమని పేర్కొన్నారు.
విద్యార్థుల నిరుద్యోగం, విద్యా సంబంధిత సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని పవన్ సూచించారు. విద్యార్థుల ఆవేదనను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని, వారి సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం చర్చలకు సిద్ధంగా ఉందని తెలిపారు. అయితే, ప్రజాస్వామ్య నిరసన పేరుతో దేశ సార్వభౌమత్వాన్ని సవాలు చేసే నినాదాలు చేయడం, హింసకు పాల్పడడం, ప్రభుత్వ ఆస్తుల విధ్వంసం, మత విశ్వాసాలను అవమానించడం వంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించలేమని పవన్ స్పష్టం చేశారు.
Also Read
ప్రజా ఉద్యమాలను దేశ వ్యతిరేక శక్తులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. ప్రజాస్వామ్యబద్ధమైన నిరసనలకు తన పూర్తి మద్దతు ఉంటుందని, అయితే దేశ వ్యతిరేక కార్యకలాపాలకు ఎప్పటికీ వ్యతిరేకంగానే ఉంటానని పవన్ కల్యాణ్ తెలిపారు. అలాగే, జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ) అమలుతో దేశ విద్యా వ్యవస్థలో సమూల మార్పులు చోటుచేసుకుంటాయని ఆయన అభిప్రాయపడ్డారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సంస్కరణలను సానుకూలంగా స్వీకరించాలని సూచించారు.
చివరగా, ప్రతి ఒక్కరూ ‘నేషన్ ఫస్ట్’ అనే భావనతో దేశ సమగ్రత, సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు కృషి చేయాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య హక్కులను వినియోగించుకునే సమయంలో దేశ ప్రయోజనాలకు భంగం కలగకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్..
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!