Pawan Kalyan Ayurvedic Treatment: కుడి భుజానికి ప్రత్యేక ఆయుర్వేద థెరపీ.. కేరళం చేరుకున్న పవన్‌ కల్యాణ్‌..

Pawan Kalyan

Pawan Kalyan

Pawan Kalyan Ayurvedic Treatment: జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ కేరళం చేరుకున్నారు. ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్న తన కుడి భుజానికి తదుపరి చికిత్సలో భాగంగా ఆయన కేరళంలోని ఆయుర్వేద వైద్యాన్ని ఆశ్రయించనున్నారు. శనివారం సాయంత్రం కొచ్చి విమానాశ్రయానికి చేరుకున్న పవన్ కల్యాణ్.. అక్కడి నుంచి నేరుగా చికిత్స అందించనున్న ఆయుర్వేద వైద్యశాలకు బయలుదేరి వెళ్లారు. త్రిస్సూర్ సమీపంలోని ఓ ఆయుర్వేద వైద్యశాలలో ఆయనకు ప్రత్యేక థెరపీ ద్వారా చికిత్స అందించనున్నట్లు సమాచారం. ఇటీవల కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న పవన్ కల్యాణ్‌.. కోలుకునే ప్రక్రియలో భాగంగా ఈ ప్రత్యేక చికిత్స తీసుకోనున్నారు. కేరళలోని ఆయుర్వేద వైద్యశాలలో అందించే థెరపీ ద్వారా భుజానికి మరింత ఉపశమనం, పునరుద్ధరణ కలిగేలా చికిత్స కొనసాగించనున్నట్లు తెలుస్తోంది.