CM Chandrababu: ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు, వరదలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష సమావేశం నిర్వమించారు.. 8 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఆయా శాఖల ఉన్నతాధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష జరిపిన ఆయన.. ఆయా జిల్లాలలో తాజా పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.. ప్రజలను అప్రమత్తం చేయడం ద్వారా ప్రాణ, ఆస్థి నష్టం జరగకుండా చూడాలని ఆదేశించారు.. 185 ఎంఎంకు గాను 244 ఎంఎం వర్షపాతం నమోదు అయ్యింది.. రాష్ట్ర వ్యాప్తంగా 31 శాతం అదనంగా వర్షపాతం నమోదు అయ్యిందని ఈ సందర్భంగా వెల్లడించారు.. చెరువులు, వాగుల్లో ప్రవాహాలపై నిరంతర పర్యవేక్షణ ఉండాలన్నారు..
Read Also:Healthy Habits: పనిలోపడి కూర్చుకీ అత్తుకొని పోతున్నారా..? అయితే ఇలా చేయాల్సిందే..
అయితే, రాష్ట్రంలో 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయిన ప్రాంతాలు కూడా ఉన్నాయని సీఎం దృష్టికి తీసుకెళ్లారు అధికారులు. ఇసుక, మట్టి అక్రమ తవ్వకాల వల్ల గోదావరి కట్టలు బలహీన పడి ఉంటాయని.. వీటిపై దృష్టిపెట్టాలని సూచించారు సీఎం చంద్రబాబు.. ఇరిగేషన్, రెవెన్యూ శాఖలు సమన్వయంతో పని చేయాలని స్పష్టం చేసిన ఇయన.. ఫ్లడ్ మాన్యువల్ ను అధికారులు పాటించాలన్నారు. విపత్తులు వచ్చినప్పుడే సమర్థత బయట పడుతుంది. అధికారులు పూర్తి అప్రమత్తంగా, డైనమిక్ గా పని చేయాలని ఆదేశించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. కాగా, రాష్ట్రంలో భారీ వర్షాలతో పలు జిల్లాలు అతలాకుతలం అవుతోన్న విషయం విదితమే.. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో వర్షాలు, వరదలతో.. పలు గ్రామాలు రాకపోకలు నిలిచిపోయాయి.