NTR Bharosa Pension: ఇప్పటి వరకు పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకోలేదా..? అయ్యో గడువు ముగిసిందే అనే బాధ పడాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే.. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల దరఖాస్తుల గడువు పొడిగించింది కూటమి ప్రభుత్వం.. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల దరఖాస్తుల గడువును సెప్టెంబర్ 18వ తేదీ వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.. ఇక, అర్హులైన ప్రతి ఒక్కరికీ అవకాశం కల్పించేందుకే మరో రెండు రోజులు గడువు పెంచినట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు .గతంలో సెప్టెంబర్ 16వ తేదీ వరకు ఉన్న గడువును సెప్టెంబర్ 18వ తేదీ వరకు.. అంటే అదనంగా రెండు రోజులు పొడిగించారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు సహా అర్హులైన ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం చెబుతోంది.. స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు కేంద్రాల్లో దరఖాస్తుల స్వీకరణతో పాటు ఈ-కేవైసీ ఇచ్చేందుకు పూర్తి ఏర్పాట్లు చేశారు అధికారులు..
మొత్తంగా.. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునే గడువును రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. అర్హులైన ప్రతి ఒక్కరికీ అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 18వ తేదీ వరకు అర్హులు పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది.వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు సహా అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సూచించారు. దరఖాస్తులను స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు కేంద్రాల్లో స్వీకరించనున్నట్లు తెలిపారు. అర్హుల దరఖాస్తుల కోసం ఆన్‌లైన్ నమోదు, ఈ-కేవైసీ ప్రక్రియకు కూడా పూర్తి ఏర్పాట్లు చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సుమారు 62 లక్షల మంది ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పొందుతున్నారు. కొత్తగా అర్హత ఉన్నవారు గడువు ముగిసేలోపు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు..

