Tirumala Srivari Brahmotsavam 2026: తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. ఏ రోజు ఏ వాహన సేవ అంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tirumala Srivari Brahmotsavam 2026: తిరుమల: శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ఈ నెల 23వ తేదీ వరకు తిరుమలలో వైభవంగా జరగనున్నాయి. ఇప్పటికే శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. ఇవాళ సాయంత్రం కీలకఘట్టమైన ధ్వజారోహణం కార్యక్రమం జరగనుంది. దీంతో, తిరుమల గిరుల్లో బ్రహ్మోత్సవ శోభ కనిపిస్తోంది. నిన్న సాయంత్రం బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. శ్రీవారి తరపున సేనాధిపతి అయిన విష్వక్సేనులవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపుగా వెళ్లి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షించారు. అనంతరం ఆలయంలోని యాగశాలలో భూమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి, పుట్ట మన్నులో నవధాన్యాలను నాటారు వేద పండితులు, ఆలయ అర్చకులు. వైఖానస ఆగమోక్తంగా అంకురార్పణ ఘట్టం నిర్వహించారు. ఇక, ఈ రోజు సాయంత్రం మీన లగ్నంలో ధ్వజారోహణం కార్యక్రమం నిర్వహిస్తారు ఆలయ అర్చకులు.
ఇక, శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ఈ నెల 23వ తేదీ వరకు తిరుమలలో వైభవంగా జరగనున్న నేపథ్యంలో.. ప్రతి రోజు శ్రీవారికి వివిధ వాహన సేవలు నిర్వహించనున్నారు.. నేడు సాయంత్రం మీన లగ్నంలో ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. రాత్రి 9 గంటలకు పెద్దశేష వాహనసేవతో వాహన సేవలు ప్రారంభమవుతాయి. రేపు ఉదయం 8 గంటలకు చిన్నశేష వాహన సేవ, రాత్రి 7 గంటలకు హంస వాహన సేవ నిర్వహించనున్నారు. ఎల్లుండి ఉదయం 8 గంటలకు సింహ వాహన సేవ, రాత్రి 7 గంటలకు ముత్యపుపందిరి వాహన సేవ జరగనుంది.
Also Read
- AP and Telangana Weather: ఏపీ, తెలంగాణపై ఉపరితల ద్రోణుల ప్రభావం.. పలు ప్రాంతాలకు వర్ష సూచన
- AP Government: కేఆర్ఎంబీకి ఏపీ కీలక లేఖ.. శ్రీశైలం నీటి వినియోగంపై అభ్యంతరం
- Amaravati - Krishna River: అమరావతికి గుడ్‌న్యూస్.. కృష్ణా నది కరకట్ట పనులకు గ్రీన్ సిగ్నల్
- AP Government: ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్‌న్యూస్.. EHSపై ప్రభుత్వం కీలక నిర్ణయం
18వ తేదీన ఉదయం 8 గంటలకు కల్పవృక్ష వాహన సేవ, రాత్రి 7 గంటలకు సర్వభూపాల వాహన సేవ నిర్వహిస్తారు. 19వ తేదీన ఉదయం 8 గంటలకు మోహినీ అవతారం, రాత్రి 6:30 గంటలకు గరుడ వాహన సేవ జరగనుంది. 20వ తేదీన ఉదయం 8 గంటలకు హనుమంత వాహన సేవ, సాయంత్రం 4 గంటలకు స్వర్ణరథ ఊరేగింపు, రాత్రి 7 గంటలకు గజ వాహన సేవ నిర్వహించనున్నారు. 21వ తేదీన ఉదయం 8 గంటలకు సూర్యప్రభ వాహన సేవ, రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహన సేవ జరుగుతుంది. 22వ తేదీన ఉదయం 7 గంటలకు రథోత్సవం, రాత్రి 8 గంటలకు అశ్వ వాహన సేవ నిర్వహించనున్నారు. చివరి రోజైన 23వ తేదీన ఉదయం 6 గంటల నుంచి 9 గంటల మధ్య చక్రస్నానం నిర్వహిస్తారు. అనంతరం రాత్రి ధ్వజావరోహణంతో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.
* ఇవాళ రాత్రి 9 గంటలకు పెద్దశేష వాహనసేవ
* రేపు ఉదయం 8 గంటలకు చిన్నశేష వాహన సేవ.. రాత్రి 7 గంటలకు హంస వాహనసేవ
* ఎల్లుండి ఉదయం 8 గంటలకు సింహ వాహనసేవ.. రాత్రి 7 గంటలకు ముత్యపుపందిరి వాహనసేవ
* 18వ తేదీ ఉదయం 8 గంటలకు కల్పవృక్ష వాహన సేవ.. రాత్రి 7 గంటలకు సర్వభూపాల వాహనసేవ
* 19వ తేదీ ఉదయం 8 గంటలకు మోహిని అవతారం.. రాత్రి 6:30 గంటలకు గరుడ వాహనసేవ
* 20వ తేదీ ఉదయం 8 గంటలకు హనుమంత వాహనసేవ.. సాయంత్రం 4 గంటలకు స్వర్ణరథ ఊరేగింపు.. రాత్రి 7 గంటలకు గజ వాహనసేవ
* 21వ తేది ఉదయం 8 గంటలకు సూర్యప్రభ వాహనసేవ.. రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహనసేవ
* 22వ తేదీ ఉదయం 7 గంటలకు రథోత్సవం .. రాత్రి 8 గంటలకు అశ్వవాహన సేవ..
* 23న తేది ఉదయం 6 నుంచి 9 గంటల మధ్య చక్రస్నానం.. రాత్రి ధ్వజాఅవరోహణంతో ముగియనున్న వార్షిక బ్రహ్మోత్సవాలు
తాజావార్తలు
-
Maruti Suzuki: చౌకైన మారుతి కార్లలోనూ ADAS.. సుజుకీ మాస్టర్ ప్లాన్..!
-
RBI FD Rules 2026: బ్యాంకు ఎఫ్డీలపై ఆర్బీఐ కొత్త రూల్స్.. ప్రతీ రోజు వడ్డీ రేట్లు వెల్లడించాల్సిందే..
-
Rohit-Kohli Records: గువాహటిలో రో-కో రికార్డుల జాతర.. దిగ్గజాల ఖాతాలో ఎన్నో ప్రత్యేకతలు!
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
Varanasi : రికార్డ్ ధర పలుకుతున్న వారణాసి తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్.. పోటీలో మైత్రి, దిల్ రాజు, నాగవంశీ
ట్రెండింగ్
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!