NTV Telugu Site icon

AP Nominated Posts: నామినేటెడ్‌ పదవుల భర్తీ.. 47 మార్కెట్‌ కమిటీలకు ఛైర్మన్ల ప్రకటన

Nda

Nda

AP Nominated Posts: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నామినేటెడ్‌ పోస్టుల భర్తీపై కూడా ఫోకస్‌ పెట్టింది.. ఇప్పటికే మెజార్టీ పదవుల్లో కూటమిలోని టీడీపీ, జనసేన, బీజేపీ నేతలను కూర్చోబెట్టిన ప్రభుత్వం.. ఈ రోజు మరో 47 మార్కెట్‌ కమిటీలకు ఛైర్మన్లను ప్రకటించింది.. 47 మార్కెట్ కమిటీలకు గాను మొత్తంగా సభ్యులతో కలిపి 705 నామినేటెడ్ పదవులు భర్తీ చేసింది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి సర్కార్.. అభ్యర్థుల ఎంపికకు ప్రజాభిప్రాయ సేకరణ చేసి.. ఆ తర్వాత వారి పేర్లను ప్రకటించింది.. తాజాగా ప్రకటించిన 47 ఏఏంసీ ఛైర్మెన్ల పదవుల్లో 37 టీడీపీ నేతలకు, 8 జనసేన పార్టీ నేతలకు, 2 బీజేపీ నాయకులకు దక్కాయి. త్వరలోనే మిగిలిన మార్కెట్ కమిటీల ఛైర్మెన్లను ప్రకటించనుంది తెలుగుదేశం పార్టీ.. ఇక, కూటమి ప్రభుత్వం ప్రకటించిన 47 మార్కెట్‌ కమిటీలకు సంబంధించిన.. కమిటీలతో పాటు.. కమిటీ చైర్మన్‌గా ఎంపికైన నేతల పేర్లు.. వారు ఏ పార్టీకి చెందినవారు అనే విషయాన్ని కూడా కింది జాబితాలో తెలుసుకోవచ్చు..

Read Also: Study Warns: గుండెపోటు ప్రమాదం..! మీ పిల్లలు రాత్రుల్లో ఫోన్‌ చూస్తూ.. నిద్రకు దూరమవుతున్నారా.?