Site icon NTV Telugu

New Bar Policy: కొత్త బార్లకు స్పందన కరువు..! ప్రభుత్వం కీలక నిర్ణయం

New Bar Policy

New Bar Policy

New Bar Policy: ఆంధ్రప్రదేశ్ లో కొత్త బార్ల ఏర్పాటుకు స్పందన పెద్దగా రాలేదు… 840 బార్లకు కేవలం 466 మాత్రమే దరఖాస్తులు పెట్టుకున్నారు.. ఓపెన్ కేటగిరీలో 388 కల్లు గీత కార్మికులకు ఇచ్చిన రిజర్వ్డ్ లో 78 బార్లు డ్రాలో కేటాయించారు.. మిగిలిన వాటికి సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. ఏపీ ప్రభుత్వం ఇప్పటికే కొత్త.. బార్ పాలసీని ప్రకటించింది.. రాష్ట్రవ్యాప్తంగా ఓపెన్ కేటగిరీ లో 840 బార్లు ఉన్నాయి.. వీటిలో 10 శాతం రిజర్వ్డ్ కేటగిరీలో కల్లు గీత కార్మికుల కు 84 బార్లు కేటాయించారు. బార్ల కేటాయింపును పారదర్శకత కోసం లాటరీ విధానం అమలు చేసింది ప్రభుత్వం.. 5 లక్షల ఫీజ్ తో నాలుగు దరఖాస్తులు తప్పనిసరిగా ఇవ్వాలి అనే నిబంధన పెట్టారు.. దీంతో పాటు బార్ లకు సరఫరా చేసే మద్యంలో అదనంగా 15 శాతం రిటైల్ సుంకం చెల్లించాల్సి ఉంది.. దీని వల్ల ఒక్కో లైసెన్సి కి అదనంగా 30 లక్షలు భారం పడనుంది.. పర్మిట్ రూమ్ లకు కూడా అనుమతి ఇచ్చింది ప్రభుత్వం.. ఈ కారణాలతో కొత్త బార్ల ఏర్పాటుకు ఆశించినంత స్పందన రాలేదు.

Read Also: CM Revanth Reddy: లక్ష కోట్ల ఆస్తి ఎలా కేసీఆర్?.. ఆ టెక్నిక్ ఏందో తెలంగాణ యువతకు చెప్పండి!

ఆంధ్రప్రదేశ్ లో కొత్త బార్ పాలసీ వచ్చే నెల 1 నుంచి అమలు లోకి రానుంది… దీంతో కొత్త బార్ లకు సంబంధించి టెండర్లు ఆహ్వానించింది ప్రభుత్వం.. 840 బార్లు ఓపెన్ క్యాటగిరి.. 10 శాతం కల్లు గీత కార్మికులకు రిజర్వ్ చేశారు. వీటిలో కేవలం 466 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి.. ఓపెన్ క్యాటగిరి లో 388 బార్లకు 1657 దరఖాస్తులు వచ్చాయి. రిజర్వ్డ్ కేటగిరీ లో 78 బార్లకు 564 దరఖాస్తులు వచ్చాయి. జిల్లాల వారీగా బార్ల కేటాయింపు జరిగింది.. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో. డ్రా… ఆఫ్ లాట్స్.. లాటరీ నిర్వహించారు. ఓపెన్ కేటగిరి లో 388. రిజర్వ్డ్ కేటగిరి లో 78 బార్లకు సంబంధించి డ్రా తీశారు.. ఓపెన్ క్యాటగిరిలో 37 బార్లకు.. రిజర్వ్డ్ లో 3 బార్లకు నాలుగు కన్నా తక్కువ దరఖాస్తులు వచ్చాయి.. దీంతో మరో రెండు రోజులు అంటే రేపు సాయంత్రం వరకు గడువు ఇచ్చారు.. ఎల్లుండి డ్రా తీస్తారు.. మిగిలిన బార్ లకు సంబంధించి త్వరలో రీ నోటిఫికేషన్ ఇస్తారు.

Exit mobile version