NTV Telugu Site icon

NITI Aayog Team Meets CM Chandrababu: స్వర్ణాంధ్ర సాధనకు తోడ్పాటు ఇవ్వండి.. నీతి ఆయోగ్‌ను కోరిన సీఎం..

Niti Aayog Team

Niti Aayog Team

NITI Aayog Team Meets CM Chandrababu: స్వర్ణాంధ్ర 2047 సాధనకు తోడ్పాటు అందివ్వాలని నీతి ఆయోగ్‌ వైస్‌ ఛైర్మన్‌ సుమన్‌ బేరిని కోరారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఏపీ లో ఏఐకు సంబంధించి అభివృద్ధిపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు సీఎం… ఏపీ అభివృద్ధికి అనేక చర్యలు తీసుకుంటున్నాం అని.. నీతి ఆయోగ్ సహకారం కూడా అవసరం అన్నారు. అయితే, ముఖ్యమంత్రి చంద్రబాబుతో నీతి ఆయోగ్ బృందం సమావేశం అయ్యింది.. వైఎస్ ఛైర్మన్ సుమన్ బేరీ నేతృత్వంలోని నీతి ఆయోగ్ బృందానికి రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ స్వాగతం పలకగా.. ఏపీ విజన్ 2047 సహా ఏపీ ఆర్థిక పరిస్థితి, అమరావతి నిర్మాణం నీతి ఆయోగ్ బృందానికి, సీఎం చంద్రబాబు మధ్య చర్చలు సాగాయి.. ఆంధ్రప్రదేశ్ కు ఆర్థికంగా అండగా ఉండేలా నిర్ణయాలు ఈ సందర్భంగా సీఎం కోరారు.. ఏపీకి ఉన్న అప్పులు వాటితో పాటు చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలపై ఈ సమావేశంలో చర్చించారు.. ఇక, కారు వరకు వెళ్లి నీతి ఆయోగ్ వైఎస్ ఛైర్మన్ కు వీడ్కోలు చెప్పారు సీఎం చంద్రబాబు నాయుడు..

Read Also: Sri Murali : పాన్ ఇండియా హిట్ కోసం పట్టువదలని విక్రమార్కుడిలా