Good News to Cotton Farmers: పత్తి రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. రేపటి నుంచే పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది.. పత్తికి కనీస మద్దతు ధర రూ.8,110గా నిర్ణయించింది.. రాష్ట్రవ్యాప్తంగా 30 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.. తక్షణమే పత్తి సేకరణ చేపట్టాలని సీసీఐ సంబంధిత అధికారులను ఆదేశించారు ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు.. 2025-26 సంవత్సరానికి 4.56 లక్షల హెక్టార్లలో పత్తి సాగు అయినట్లు, సుమారు 8 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చిందనే అంచనాలు ఉండగా.. రైతులు ముందుగా రైతు సేవా కేంద్రాల ద్వారా తమ వివరాలను సీఎం యాప్ లో విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ ద్వారా నమోదు చేసుకోవాలని.. ఆ తర్వాత “కపాస్ కిసాన్” యాప్‌లో అదే వీఏఏ సహాయంతో స్లాట్ బుక్ చేసుకోవాలని రైతులకు సూచించారు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు..
Read Also: Viral Video: పుట్టకు పూజలు, నాగయ్య ప్రత్యక్షం.. కార్తీక సోమవారం నాడు అద్భుత దృశ్యం!
మరోవైపు మొంథా తుఫాన్ తీవ్రత అధికంగా ఉండబోతున్నా రైతులు ఆందోళన చెందవద్దు అని సూచించారు మంత్రి అచ్చెన్నాయుడు.. గతంలో కూడా తీవ్ర ప్రకృతి విపత్తులను సీఎం చంద్రబాబు నాయకత్వంలో విజయవంతంగా ఎదుర్కొన్నాం.. ఈసారి కూడా పకడ్బందీ ప్రణాళికలతో ప్రాణ, ఆస్తి నష్టాలు జరగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో శాస్త్రవేత్తలు, అధికారులు, సిబ్బంది అందరినీ అప్రమత్తం చేశాం.. వ్యవసాయ, ఉద్యాన పంటల ప్రాథమిక నష్ట అంచనా నివేదికలు సేకరించాం.. ముంపు ప్రాంతాలను గుర్తించి ముందస్తు నష్ట నివారణ చర్యలు చేపట్టాం.. రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని సూచించారు.. శాస్త్రవేత్తలు క్షేత్ర స్థాయిలో పంట నష్టం తగ్గించే సూచనలు ఇస్తున్నారు.. సోషల్ మీడియా ద్వారా 24×7 రైతులకు సలహాలు, సూచనలు అందిస్తున్నాం.. తుఫాను అనంతరం నష్టం వాటిల్లిన ప్రతి రైతును ప్రభుత్వం పూర్తిగా ఆదుకుంటుంది.. మత్స్యకారులను అప్రమత్తం చేసి వేటకు వెళ్లకుండా చర్యలు తీసుకున్నాం.. వారి వలలు, బొట్లు రక్షించుకునే ఏర్పాట్లు పూర్తయ్యాయి.. మూగజీవుల ప్రాణనష్టం జరగకుండా అన్ని చర్యలు చేపట్టాం.. ప్రతి రైతుకు అండగా ప్రభుత్వం ఉంటుందని తెలిపారు మంత్రి అచ్చెన్నాయుడు..
