Nara Lokesh: నేపాల్‌లో చిక్కుకున్న తెలుగువారిని సురక్షితంగా రాష్ట్రానికి తీసుకురావడానికి రంగంలోకి దిగారు మంత్రి నారా లోకేష్.. అనంతపురంలో సూపర్ సిక్స్ – సూపర్ హిట్ సభకు కూడా వెళ్లకుండా.. నేపాల్ నుంచి ఏపీవారిని సురక్షితంగా రాష్ట్రానికి రప్పించడానికి అధికారులతో నిరంతరం సమన్వయం చేస్తున్నారు మంత్రి నారా లోకేష్.. కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీలోని ఏపీ భవన్, రాష్ట్రానికి చెందిన వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.. ఈ సమీక్షలో హోంమంత్రి అనిత, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.. నేపాల్ రాజధాని ఖాట్మండు విమానాశ్రయానికి సమీపంలోనే 165 మంది తెలుగువారు ఉన్నారని తెలిపారు అధికారులు. సిమిల్ కోట్ సమీపంలో మరో 12 మంది తలదాచుకున్నారని లోకేష్‌కి వివరించారు అధికారులు.
Read Also: Nepal: క్లియర్ మెసేజ్ ఇచ్చిన నేపాల్ ఆర్మీ చీఫ్.. ‘‘హిందూ రాజ్యం’’గా మారుతుందా..?
పరిస్థితులు అనుకూలించిన వెంటనే ప్రత్యేక విమానం ద్వారా వీరందరినీ దేశానికి తీసుకురావడంపై అధికారులకు దిశానిర్దేశం చేశారు మంత్రి లోకేష్. ఇందుకు కావాల్సిన అనుమతులను వివరించిన అధికారులు, కేంద్రంతో సమన్వయం చేసుకుని అవసరమైన చర్యలు చేపట్టాలని లోకేష్ ఆదేశించారు.. బాధితులతో ప్రతి రెండు గంటలకోసారి ఫోన్ లో మాట్లాడుతూ వారిలో ధైర్యం నింపుతున్నారు లోకేష్.. ఆహారం, నీరు, ఇతర సౌకర్యాలు అందుతున్నాయా అని బాధితులను వాకబు చేసిన ఆయన.. సురక్షితంగానే ఉన్నామని, అక్కడ ఉన్న పరిస్థితులను లోకేష్ కు వివరించారు నేపాల్ లో చిక్కుకున్న తెలుగువారు. ఏ సాయం కావాలన్నా ఫోన్ ద్వారా సంప్రదించాలని తెలుగువారికి సూచించారు.. రాష్ట్రానికి సురక్షితంగా తీసుకురావడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని బాధితులకు భరోసా ఇస్తున్నారు మంత్రి నారా లోకేష్..
