NTV Telugu Site icon

Nara Lokesh: నిజం చెబితే తల వెయ్యి ముక్కలు అవుతుందనే శాపం మీకేమైనా ఉందా..? జగన్‌ను నిలదీసిన లోకేష్‌..

Lokesh

Lokesh

Nara Lokesh: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ వ్యాఖ్యలపై కౌంటర్‌ ఎటాక్‌కు దిగారు మంత్రి నారా లోకేష్‌.. విజయవాడ జైలులో ఉన్న వల్లభనేని వంశీని పరామర్శించిన తర్వాత జగన్‌ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం, టీడీపీపై విమర్శలు చేశారు.. వంశీపై తప్పుడు కేసులు పెట్టారని జగన్‌ వ్యాఖ్యానించారు.. ఇక, జగన్‌ వ్యాఖ్యలపై సోషల్‌ మీడియా వేదికగా.. స్పందించారు నారా లోకేష్.. జగన్‌ వ్యాఖ్యలు.. గతంలో గన్నవరం టీడీపీ ఆఫీస్‌పై దాడి దృశ్యాలను కలిపి వీడియో షేర్ చేసిన లోకేష్.. “నిజం చెబితే తల వెయ్యి ముక్కలు అవుతుందనే శాపం మీకేమైనా ఉందా జగన్ రెడ్డి గారు?” అంటూ ఎద్దేవా చేశారు.. పచ్చి అబద్దాలను కాన్ఫిడెంట్ గా చెప్పడంలో మీరు పీహెచ్‌డీ చేసినట్టు ఉన్నారు అంటూ దుయ్యబట్టారు.. మీరు ఏం చెప్పినా ప్రజలు నమ్ముతారు అనే భ్రమలోంచి ఇకనైనా బయటకు రండి అని సూచించారు.. 100 మందికిపైగా వైసీపీ రౌడీలు తెలుగుదేశం పార్టీ కార్యాలయం పై దాడి చేయడం కోట్లాది ప్రజలు కళ్లారా చూశారని గుర్తుచేశారు.. కక్ష సాధింపు, కుట్రలు, కుతంత్రాలు మీ బ్రాండ్ జగన్ రెడ్డి గారు. అధికారం ఉన్నప్పుడు యథేచ్చగా చట్టాలను తుంగలో తొక్కి… ఇప్పుడు ప్రజాస్వామ్యం, పద్ధతులు అంటూ మీరు లెక్చర్ ఇవ్వడం వింతగా ఉంది అంటూ మండిపడ్డారు మంత్రి నారా లోకేష్‌..