Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రయాణంలో ఐఐటీ నిపుణుల భాగస్వామ్యం కీలకమని మంత్రి నారా లోకేష్ అన్నారు. పాన్ ఐఐటీ సదస్సులో పాల్గొన్న ఆయన.. రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు పరిశ్రమలు, పరిశోధనలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. 23 ఐఐటీలకు చెందిన దాదాపు 5 లక్షల మంది పూర్వ విద్యార్థులతో పాన్ ఐఐటీ సమాఖ్య ఉందని, వారి నైపుణ్యం, అనుభవాలను ఏపీ అభివృద్ధికి ఉపయోగించుకోవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు. ఏపీ ప్రభుత్వ అభివృద్ధి మంత్రం స్పీడ్, సర్వీస్, స్టెబిలిటీ అని లోకేష్ పేర్కొన్నారు. పెట్టుబడుల విషయంలో కేవలం ఎంవోయూలు చేసుకోవడానికే పరిమితం కాకుండా.. ప్రాజెక్టులను వాస్తవ రూపంలోకి తీసుకురావడం, ఉద్యోగాల కల్పనపై ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నామని తెలిపారు. పెట్టుబడిదారులకు ప్రభుత్వ సేవలను మరింత వేగంగా అందించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
పాలసీలకు చట్టపరమైన, రాజకీయ స్థిరత్వం ఉండాల్సిన అవసరం ఉందని లోకేష్ అన్నారు. కాలానుగుణంగా విధానాలను మార్చుకునే అవకాశం ఉన్నప్పటికీ.. అవి రాజకీయ మార్పులకు అతీతంగా స్థిరంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రభుత్వ విధానాలు, జీవోల రూపకల్పనలో కృత్రిమ మేధస్సు (ఏఐ)ను వినియోగిస్తున్నామని వెల్లడించారు. ఏపీలో పెట్టుబడులను ఆకర్షించేందుకు 23 ఇండస్ట్రియల్ క్లస్టర్లను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. హార్టికల్చర్ నుంచి క్వాంటం టెక్నాలజీ వరకు వివిధ రంగాలకు అనుగుణంగా ఈ క్లస్టర్లను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. ఆక్వాకల్చర్, మెడికల్ డివైసెస్, ఫార్మా, ఆటోమోటివ్, సిమెంట్, సోలార్, రెన్యూవబుల్ ఎనర్జీ వంటి కీలక రంగాలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు వివరించారు.
Also Read
- Amaravati Flood Control System: 200 ఏళ్ల వర్షపాతంపై అధ్యయనం.. అమరావతి వరద నియంత్రణకు పక్కా ప్లాన్..!
- Bay of Bengal Cyclone Alert: బంగాళాఖాతంలో మరో వాయుగుండం.. ఏపీకి వాతావరణ శాఖ అలర్ట్
- AP Drought Mandals 2026: కరువు కోరల్లో ఏపీ.. 21 జిల్లాల్లో 388 మండలాలు.. ప్రభుత్వం కీలక ఆదేశాలు
- Amaravati Construction: అమరావతి నిర్మాణంలో కీలక సమస్య..! కార్మికులపై అధికారుల దృష్టి
ఏపీలో డీప్‌టెక్, క్వాంటం పరిశోధనలకు కూడా ప్రాధాన్యం ఇస్తున్నామని లోకేష్ వెల్లడించారు. ఐఐటీలు, పరిశ్రమలు కలిసి పరిశోధనలు నిర్వహించడంతో పాటు ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు కృషి చేయాలని అన్నారు. రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్న 23 క్లస్టర్లకు ఐఐటీ నిపుణుల మార్గదర్శకత్వం అవసరమని, వారి సూచనలు తీసుకోవాలని కోరారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లో పనిచేస్తున్న ఐఐటీ పూర్వ విద్యార్థులు ఏపీ పరిశ్రమల అభివృద్ధికి సహకరించాలని లోకేష్ విజ్ఞప్తి చేశారు. వారి అనుభవాలు, పరిచయాలను రాష్ట్రంతో అనుసంధానం చేయడం ద్వారా కొత్త పెట్టుబడులు, సాంకేతికత, పరిశ్రమలకు అవకాశాలు పెరుగుతాయని అన్నారు. పరిశ్రమల అభివృద్ధితో పాటు పరిశోధనలకు కూడా సమాన ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.
పునరుత్పాదక విద్యుత్ రంగంలోనూ ఏపీ వేగంగా ముందుకు సాగుతోందని మంత్రి తెలిపారు. గత ఏడాదిలో రాష్ట్రంలో 4.8 గిగావాట్ల రెన్యూవబుల్ ఎనర్జీ సామర్థ్యాన్ని జోడించామని వెల్లడించారు. పునరుత్పాదక విద్యుత్ రంగంలో ఆంధ్రప్రదేశ్‌ను అగ్రస్థానానికి తీసుకెళ్లడమే ప్రభుత్వ లక్ష్యమని నారా లోకేష్ పేర్కొన్నారు. పాన్ ఐఐటీ సమాఖ్యలోని 23 ఐఐటీలకు చెందిన పూర్వ విద్యార్థులు, నిపుణుల సహకారంతో ఏపీని సాంకేతికత, పరిశ్రమలు, పరిశోధన రంగాల్లో మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మంత్రి తెలిపారు. అమరావతిని సాంకేతిక ప్రపంచానికి పరిచయం చేసేలా రాష్ట్ర అభివృద్ధి ప్రయాణాన్ని వేగవంతం చేస్తామని పేర్కొన్నారు మంత్రి నారా లోకేష్..
తాజావార్తలు
-
Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
-
Flydubai Attack: అల్-ఖైదా ఫోటోలు, తీవ్రవాద భావాలు.. కో-పైలట్ ఉగ్రకోణం బట్టబయలు..!
-
Heart Attacks: 18ఏళ్లకే గుండెపోటు.. కారణాలు ఇవే!
-
Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
-
Satyagraha: రాహుల్ గాంధీ కొత్త అస్త్రం .. ఒంటరిగా పోరాడొద్దు.. తోడుగా నేనుంటా!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!