NTV Telugu Site icon

MP YV Subba Reddy: విజయసాయిరెడ్డి వ్యాఖ్యలపై వైవీ సుబ్బారెడ్డి కౌంటర్‌ ఎటాక్..

Yv Subba Reddy

Yv Subba Reddy

MP YV Subba Reddy: మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సిట్‌ విచారణ తర్వాత వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ, వైఎస్‌ జగన్‌పై సంచలన ఆరోపణలు చేశారు.. అయితే, సాయిరెడ్డి వ్యాఖ్యలకు వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.. పార్టీ నుంచి వెళ్లిపోయాక ఏదో రకంగా అభియోగాలు మోపాలని చూస్తున్నారని దుయ్యబట్టారు.. అధికారంలో ఉన్నప్పుడు పార్టీలో కోటరీ ఉందా..? లేదా..? అసలు కోటరీ నడిపిందెవరో ఆయనకు తెలియదా..? అని నిలదీశారు.. మేం అధికారంలో ఉన్నప్పుడు మా అధ్యక్షుడు నాయకులతో, అధికారులతో చర్చించాకే నిర్ణయాలు తీసుకునేవారు అని స్పష్టం చేశారు.. కోటరీ ఉందో లేదో ఆయనకే తెలియాలన్నారు.

Read Also: Viral Video: స్టేజీపై ‘పుష్ప 2’ పాటకు స్టెప్పులేసిన మాజీ సీఎం.. రచ్చ రచ్చే (వీడియో)

ఇక, పార్టీ ఐదేళ్లూ అధికారంలో ఉన్నప్పుడు ఆయనే కదా ప్రధానంగా చక్రం తిప్పింది..? అని ప్రశ్నించారు వైవీ సుబ్బారెడ్డి.. నంబర్ 2 నుంచి 2 వేల స్థానానికి పోయానని ఆయనే చెబుతున్నాడు.. అసలు మా పార్టీలో నంబర్ 2 స్థానం అనేది ఎప్పుడూ లేదు.. రాబోయే రోజుల్లో కూడా ఉండదని.. మా పార్టీలో 1 నుంచి 100 వరకూ అన్నీ జగన్ మోహన్ రెడ్డే అని స్పష్టం చేశారు.. కూటమి అధికారంలోకి వచ్చాక మా నాయకులపై అక్రమ కేసులు పెడుతున్నారు.. లిక్కర్ స్కామ్ అని భూతద్దంలో పెట్టి చూస్తున్నారు.. భయపెట్టి కొంతమందిని లొంగదీసుకునే కార్యక్రమం చేస్తున్నారని ఆరోపించారు.. అయితే, అన్నింటి పైనా న్యాయపోరాటం చేస్తామని స్పష్టం చేశారు.. మా హయాంలో ఎలాంటి స్కామ్‌లు జరగలేదన్నారు వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి..

Vijayasai Reddy పార్టీ నుంచి వెళ్ళిపోయాక అభియోగాలు మోపుతున్నారు - YV Subba Reddy | Ntv