Site icon NTV Telugu

Daggubati Purandeswari: పురంధేశ్వరికి కీలక పోస్టు.. లోక్‌సభ స్పీకర్‌ ఉత్తర్వులు

Purandeswari

Purandeswari

Daggubati Purandeswari: భారతీయ జనతా పార్టీ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అధ్యక్షురాలు.. రాజమండ్రి లోక్‌సభ సభ్యురాలిగా ఉన్న దగ్గుబాటి పురంధేశ్వరికి కీలక బాధ్యతలు అప్పగించింది కేంద్ర ప్రభుత్వం.. కామన్వెల్త్ మహిళా పార్లమెంటరీ స్టీరింగ్ కమిటీ చైర్‌పర్సన్‌గా ఎంపీ పురంధేశ్వరిని నియమించారు.. కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ ( సీపీఏ) ఇండియా రీజియన్ ప్రతినిధిగా.. కామన్వెల్త్ మహిళా పార్లమెంటరీ స్టీరింగ్ కమిటీ సభ్యురాలిగా నామినేట్ అయ్యారు పురంధేశ్వరి.. ఈ మేరకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది.. 2026 చివరి వరకు ఈ నియామకం వర్తించనుంది.. అంటే 2024 నుంచి 2026 చివరి వరకు కామన్వెల్త్ మహిళా పార్లమెంటరీ స్టీరింగ్ కమిటీ చైర్‌పర్సన్‌గా కొనసాగనున్నారు పురంధేశ్వరి.. మహిళా పార్లమెంటేరియన్లు, స్టీరింగ్ కమిటీకి చైర్‌పర్సన్‌గా కూడా ఆమె వ్యవహరిస్తారని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా..

Read Also: Sunitha Laxma Reddy: మాపై హత్యాయత్నం చేశారు.. సునీతా లక్ష్మారెడ్డి కీలక వ్యాఖ్యలు

కాగా, యూపీఏ హయాంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన దగ్గుబాటి పురంధేశ్వరి.. ఈ బీజేపీ నుంచి రాజమండ్రి లోక్‌సభ స్థానంలో విజయం సాధించారు.. దీంతో.. మరోసారి ఆమెను కేంద్రమంత్రి పదవి వరిస్తుందా? అనే చర్చ కూడా సాగింది.. కానీ, ఇప్పుడు కీలక పోస్టుతో ఆమెను గౌరవించింది ఎన్డీఏ సర్కార్‌.. కాగా, ప్రస్తుతం ఆమె బీజేపీ ఏపీ అధ్యక్షురాలిగా కూడా కొనసాగుతోన్న విషయం విదితమే..

Exit mobile version