Mithun Reddy: వచ్చేది జగనన్న ప్రభుత్వమే.. దానికోసం ఎన్ని కేసులైనా.. ఎన్ని ఇబ్బందులైనా ఎదుర్కొంటామని ప్రకటించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ మిథున్ రెడ్డి.. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన.. బెయిల్‌పై జైలు నుంచి విడుదలన ఆయన.. ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడుతూ.. టీడీపీ అధికారంలో ఉంటే మా మీద కేసులు అనేవి.. వేధించడం అన్నది మామూలే అన్నారు.. ఇవన్నీ ఒక్కరోజులో వీగిపోయే కేసులే అని కొట్టిపారేశారు.. అయితే, ఇలాంటి కేసులకు భయపడేదే లేదు అని స్పష్టం చేశారు.. కేవలం మమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతోనే అక్రమ కేసులు పెట్టారు అని ఫైర్ అయ్యారు.. ఈ కేసులతో భయపడతాం అనుకుంటే అది వారి భ్రమే అవుతుందన్నారు..
Read Also: RSS Centenary Celebrations 2025: భారతమాత సేవకే ఆర్ఎస్ఎస్ అంకితమైంది: పీఎం మోడీ
ఇక, జైల్లోనూ నన్ను చాలా ఇబ్బందులకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు మిథున్ రెడ్డి.. మా పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు మా వెంటే ఉన్నాడు.. ఎవరికి ఇవ్వని గుర్తింపు మా కుటుంబానికి ఇచ్చాడు అని పేర్కొన్నారు.. ఆంధ్రప్రదేశ్‌లో వచ్చేది జగనన్న ప్రభుత్వమే.. దానికోసం ఎన్ని కేసులైనా.. ఎన్ని ఇబ్బందులైనా ఎదుర్కొంటాం అని తెలిపారు ఎంపీ మిథున్ రెడ్డి.. మరోవైపు, ఒక ఉగ్రవాదలా నన్ను జైల్లో పెట్టారు.. రెండున్నర నెలలు ఒక ఖైదీగా ఉండాల్సిన వచ్చింది.. గౌరవ కోర్టు పెట్టిన ఆంక్షలు మేరకు కేసు గురించి ఇంతకన్నా ఎక్కువగా మాట్లాడడం కుదరదు అని తెలిపారు.. గతంలో చాలా సార్లు చెప్పాను.. ఇప్పుడు చెబుతున్నా.. ఎన్ని ఇబ్బందులు పెట్టిన.. అధైర్యపడే పరిస్థితి ఉండదు.. టీడీపీ ఎప్పుడు అధికారంలో ఉన్న మమ్మల్ని వేధించడం మామూలే అన్నారు ఎంపీ మిథున్ రెడ్డి..
