Site icon NTV Telugu

AP Liquor scam: సీఎం చంద్రబాబుతో ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు భేటీ.. లిక్కర్‌ స్కామ్‌పై సీరియస్‌గా సర్కార్..!

Mp Lavu

Mp Lavu

AP Liquor scam: ఆంధ్రప్రదేశ్‌లో గత ప్రభుత్వ హయాంలో లిక్కర్‌ స్కామ్‌ జరిగిందంటూ.. కూటమి ప్రభుత్వం ఆరోపిస్తోంది.. ఏపీలో జరిగిన లిక్కర్‌ స్కామ్‌.. ఢిల్లీలో జరిగినదానికంటే పెద్దది అంటూ విమర్శలు చేస్తూ వస్తున్నాయి.. ఆంధ్రప్రదేశ్ లో మద్యం కుంభకోణం వ్యవహారంపై ప్రభుత్వం సీరియస్‌గా ఉన్నట్టు తెలుస్తోంది.. త్వరలోనే దీనిపై కీలక నిర్ణయం తీసుకుంటారని ప్రచారం సాగుతోంది.. దానికి తగినట్టుగానే.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబును కలిశారు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు.. పార్లమెంట్‌ను తాకిన మద్యం కుంభకోణం వ్యవహారంపై చర్చించనట్టుగా తెలుస్తోంది.. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో భారీ మద్యం కుంభకోణం జరిగిందంటూ.. ఇటీవల పార్లమెంట్‌ లో లేవనెత్తారు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు.. నాలుగు వేల కోట్ల రూపాయల సొమ్మును విదేశాలకు తరలించారు అంటూ సంచలన ఆరోపణలు చేశారు.. ఇక, నిన్న కేంద్ర హోం మంత్రి అమిత్‌షాని సైతం కలిసి ఎంపీ శ్రీకృష్ణదేవరాయులు.. మద్యం కుంభకోణంపై చర్చించారట.. అయితే, ఈ పరిణామాలు అన్నీ సీఎం చంద్రబాబును కలిసి వివరించారట ఎంపీ శ్రీకృష్ణదేవరాయులు.. అయితే, ఢిల్లీలో సైతం హాట్ టాపిక్ గా మారిన ఏపీ మద్యం కుంభకోణం వ్యవహారంపై ఏపీ సర్కార్‌ సీరియస్‌గా ఉందట.. మద్యం కుంభకోణంపై కీలక నిర్ణయం తీసుకునే దిశగా ఏపీ ప్రభుత్వం ప్లాన్‌ చేస్తున్నట్టుగా సమాచారం.

Read Also: Minister Ponguleti: ధరణి పోర్టల్ బాగుందా లేదా అనేది ఎన్నికల్లో ప్రజల తీర్పుతో స్పష్టమైంది..

Exit mobile version