NTV Telugu Site icon

AP MLC Election Notification: ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

Mlc Elections

Mlc Elections

AP MLC Election Notification: ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసింది ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం.. రాష్ట్రంలోని రెండు పట్టభద్రుల నియోజకవర్గాలతో పాటు, ఒక ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి.. కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన నోటిఫికేషన్‌ మేరకు ఏపీ ఎన్నికల సంఘం.. నోటిఫికేషన్‌ విడుదల చేసింది.. ఉమ్మడి తూర్పు-పశ్చిమ గోదావరి జిల్లాలో పట్టభద్రుల నియోజకవర్గం, ఉమ్మడి కృష్ణా-గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గానికి.. ఉమ్మడి శ్రీకాకుళం-విజయనగరం-విశాఖపట్నం జిల్లా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఈ నోటిఫికేషన్‌ జారీ అయ్యింది..

Read Also: Ponnam Prabhakar: తెలంగాణలో కులగణన సర్వే పూర్తిగా నిస్పాక్షికంగా జరిగింది

ఎన్నిలక కమిషన్‌ నోటిఫికేషన్‌ ప్రకారం.. ఈ నియోజకవర్గాల్లో ఫిబ్రవరి 3వ తేదీ నుంచి 10వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు.. ఫిబ్రవరి 11న నామినేషన్ల పరిశీలన ఉండగా.. ఫిబ్రవరి 13న నామినేషన్లు ఉపసంహరణకు గడువుగా పెట్టింది ఎన్నికల కమిషన్‌.. ఇక, ఫిబ్రవరి 27వ తేదీన పోలింగ్ జరగనుండగా.. మార్చి 3వ తేదీన ఓట్ల లెక్కించి ఫలితాలను ప్రకటించనున్నారు. ఈ మేరకు ఏపీ ఎన్నికల సంఘం ప్రధానాధికారి వివేక్‌ యాదవ్‌ నోటిఫికేషన్‌ జారీ చేశారు.. కాగా, ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ వచ్చినప్పటి నుంచే ప్రధాన పార్టీలో ఎన్నికలపై ఫోకస్‌ పెట్టాయి.. అభ్యర్థులను ప్రకటించి ప్రచారాన్ని కూడా ప్రారంభించిన విషయం విదితమే..