NTV Telugu Site icon

CRDA Letter to Election Commission: రాజధాని పనులకు ఎమ్మెల్సీ కోడ్..! ఈసీకి సీఆర్డీఏ లేఖ

Crda

Crda

CRDA Letter to Election Commission: గత ప్రభుత్వ హయాంలో అమరావతి రాజధాని పనులు నిలిచిపోగా.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. మళ్లీ ఆ పనులను వేగవంతం చేసింది.. ఇప్పటికే పలు దఫాలుగా సమావేశం నిర్వహించిన.. కొన్ని పనులు చేపట్టింది.. ప్రాధాన్యతా క్రమంలో రాజధాని ప్రాంతంలో పనులు వేగవంతం చేసింది.. అయితే, రాజధాని పనులకు ఎమ్మెల్సీకోడ్ అడ్డంకిగా మారిపోయింది.. ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల ఎమ్మెల్సీ స్థానంతో పాటు కృష్ణా – గుంటూరు జిల్లాలకు సంబంధించి రెండు గ్రేడ్యుయేట్ స్థానాలకు.. విశాఖ -విజయనగరం – శ్రీకాకుళం ఒక టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి ఈ నెల 27న పోలింగ్‌ జరగనుంది..

Read Also: CM Chandrababu: వచ్చే 3 నెలలు జనంలోకి వెళ్లే పథకాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి..

అయితే, రాజధాని పనులకు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ అడ్డంకిగా మారిపోవడంతో.. కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసింది సీఆర్డీఏ. కేవలం గ్రేడ్యుయేట్ ఎన్నికలే కాబట్టి ఎన్నికల నియమావళి సడలించాలని సీఈసీని లేఖ ద్వారా కోరారు సీఆర్డీఏ అధికారులు. త్వరలోనే వరల్డ్‌ బ్యాంక్, ఏడీబీ రుణం మంజూరు కాబోతున్నాయి.. అయితే, పనుల ప్రాధాన్యత దృష్ట్యా ఇబ్బంది లేకుండా చూడాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరింది సీఆర్డీఏ.. వివిధ జోన్ల పరిధిలో 14 వేల కోట్ల విలువైన పనులు చేపట్టాం.. ఎల్పీఎస్ లే ఔట్లలో రోడ్లు.. మంచినీటి సరఫరా.. డ్రైన్లు.. విద్యుత్‌ ప్లాంటేషన్.. ఇలా కొన్ని పనులు మొదలు పెట్టాలని ఆలోచనలో ప్రభుత్వం ఉంది.. ఈ నేపథ్యంలో.. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ అడ్డంకిగా మారిన నేపథ్యంలో.. ఈసీకి లేఖ రాసింది సీఆర్డీఏ..