Site icon NTV Telugu

AP High Court: ఎమ్మెల్సీ అనంతబాబు భార్యకు హైకోర్టులో ఊరట.. కీలక ఆదేశాలు జారీ

Anantha Babu

Anantha Babu

AP High Court: వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత, ఎమ్మెల్సీ అనంతబాబు భార్య అనంత లక్ష్మీ దుర్గకు హైకోర్టులో ఊరట లభించింది. ఆమెపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన కేసులో, డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి డోర్ డెలివరీ చేసిన సంఘటన సంబంధించి కీలక ఆదేశాలు జారీ చేయబడ్డాయి. ఎమ్మెల్సీ అనంత బాబు భార్య అనంత లక్ష్మీ దుర్గ.. తనపై జారీ చేసిన నాన్ బెయిలబుల్ వారంట్‌ను రద్దు చేయమని వేసిన పిటిషన్ పై హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.. ఈ నెల 16వ తేదీ నుంచి 30వ తేదీ వరకు విచారణ అధికారి ముందు హాజరుకావాలని స్పష్టం చేసింది.. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారణలో సహకరించాలని సూచించింది.. ఇక, మార్చి 30 న రాజమండ్రి SC-ST కోర్ట్ ముందు హాజరుకావాలి. కోర్టుకు హాజరైన రోజు, జ్యుడిషియల్ రిమాండ్ లేదా బెయిల్‌ను కోర్టు నిర్ణయిస్తుంది. అనంత లక్ష్మి దుర్గ హైకోర్టు ఆదేశాల ప్రకారం విచారణకు పూర్తిగా సహకరించాల్సి ఉంటుంది..

Read Also: Warning : పెట్రోల్, గ్యాస్ కొరతపై రాష్ట్రాలకు కేంద్రం కీలక ఆదేశం. స్టాక్ బ్లాక్ చేస్తే అంతే..!

కాగా, ఈ కేసు 2022 మేలో జరిగిన దళిత యువకుడు సుబ్రహ్మణ్యం హత్యకు సంబంధించినది. ఎమ్మెల్సీ అనంత బాబు భార్యపై సప్లమెంటరీ ఛార్జ్‌షీట్‌లో పాత్ర ఉందని విచారణ సంస్థ పేర్కొంది.. కోర్టు ఇటీవల, నవంబర్ నెల ఆఖరిలో విచారణ పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించగా.. ఇప్పుడు తాజా పరిణామాలు చేసుకున్నాయి.. హైకోర్టు ఆదేశాలతో, అనంత లక్ష్మీదుర్గపై నాన్ బెయిలబుల్ వారెంట్ రద్దు చేయబడింది.. తద్వారా, అనంతలక్ష్మి దుర్గ కేసు విచారణలో పూర్తి సహకారం అందించేలా స్థిరమైన మార్గం ఏర్పడింది.

Exit mobile version