MLA Chintamaneni Prabhakar: వై నాట్ 175 అంటే వైసీపీ బట్టలు ఊడదీశారు.. జగన్ బట్టలు నైతికంగా ఊడతీశారని వ్యాఖ్యానించారు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్.. అమరాతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. వైసీపీ నేతలు ఎవర్ని బెదిరిస్తున్నారు..? అని ప్రశ్నించారు.. ఇక, మా గొప్పతనం వల్ల మేం గెలవలేదు… వైసీపీ అరాచకాలు వల్ల గెలిచామని చెప్పుకొచ్చారు.. మా లెక్కలు తేలుస్తారా..? ఏ లెక్కలు ఉన్నాయని తేలుస్తారు? అంటూ మండిపడ్డారు.. వైసీపీకి ప్రజలు రాజకీయ గోరి కట్టే రోజు దగ్గరలోనే ఉందన్న ఆయన.. దోపిడీదారులకు తమ అండ దండ ఉందని జగన్ నేతృత్వంలో వైసీపీ నేతలు వ్యవహరిస్తున్నారు.. జగన్ కు, అతని అనుచరులకు కాల్చి ఎక్కడ వాతలు పెట్టకూడదో అక్కడ ప్రజలు వాతలు పెట్టినా బుద్దిరాలేదని ఫైర్ అయ్యారు..
Read Also: Ganesh Chaturthi 2025: అలర్ట్.. గణేష్ మండపాలు ఏర్పాటు చేస్తున్నారా..? ఇవి చెక్ చేసుకోండి…
తాను చేసిన దోపిడీకి భార్యను కేసులో ఇరికించి పారిపోయిన పేర్ని నాని.. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ లపై నోరూపారేసుకుంటున్నాడు.. దోచుకోవడం, దోపిడీ చేయటమే వైసీపీ సిద్ధాంతమని దుయ్యబట్టారు చింతమనేని.. అధికారం ముసుగులో చేసిన అరాచక దాడులు మరిచారా? అని ప్రశ్నించిన ఆయన.. చేపల దొంగతానినికి పాల్పడ మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరికి మద్దతుగా జగన్ అనుచరవర్గమంతా వచ్చింది.. కొల్లేరుకు వలస పక్షులు వచ్చినట్లు అప్పుడప్పుడు దెందులూరుకు అబ్బయ్య చౌదరి వస్తాడు.. ఎప్పుడు ఎప్పుడు టీడీపీలో చేరాలా అని అబ్బయ్య చౌదరి ప్రయత్నిస్తున్నాడు.. ఎన్నికల సమయంలో కూడా నేను గెలిచి టీడీపీలో చేరతానని ప్రచారం చేసుకున్నాడని మండిపడ్డారు.. ఇక, దెందులూరు నియోజకవర్గంలో చేసిన అక్రమాలపై త్వరలో చర్యలు ఉంటాయని హెచ్చరించారు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్..
