MLA Adinarayana Reddy: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి.. ప్రస్తుతం జగన్‌కు రాష్ట్ర పురోగతి అనేది అర్ధం కాదు. ఆయనకు పదవి కావాలి అని విమర్శించారు.. చంద్రబాబు అరెస్టు కూడా ఉద్దేశపూర్వకంగా చేశారని తెలిపారు.. ఇప్పుడు జగన్ కి ఏదీ చెల్లడం లేదు… జగన్ కి పదవి కావాలి.. ధర్మ విస్మృతికి అలవాటు పడ్డాడు.. జలజీవన్ మిషన్, అమృత్ పధకాలు మనకు వస్తున్నాయి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా నిధులు వస్తున్నాయి.. జగన్ కు సూపర్ చెక్ పెట్టబోతున్నాం.. మా కూటమి పెరిగి పెరిగి అంతరిక్ష స్ధాయికి వెళుతున్నాం.. జగన్ ను థూ.. ఛా.. అనేలా చేస్తాం అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Read Also: Rahul Gandhi: బీహార్ పోలింగ్‌కు ముందు రాహుల్‌గాంధీ షాక్.. ‘ఓట్ చోర్’’పై కీలక ప్రజెంటేషన్
మొన్ననే మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్టు అయ్యాడు అని తెలిపారు ఆదినారాయణ రెడ్డి.. మహాతల్లి భారతి రెడ్డి 400 కేజీల బంగారం కొన్న విషయంపై ప్రజలకు స్పష్టత ఇవ్వాలన్న ఆయన.. పులివెందులలో ఎన్నికలలో నామినేషన్లు లేకుండా చేయడం వంటి చర్యలకు జగన్ మాట్లాడే హక్కు లేదని అభిప్రాయపడ్డాడు. రాబోయే రోజుల్లో అమరావతి పూర్తి చేస్తాం.. అభివృద్ధి పనులు ఒక్కో దశలో ప్రారంభమవుతాయని చెప్పారు. రెండు-మూడు కోట్ల ఇళ్లలో అధిక హోదాతో ఏపీకి భాగం వస్తుందని, బడ్జెట్ అంశాలపై కూడా ఆయన వ్యాఖ్యానించారు మరోవైు, వైఎస్ వివేకా కేసుపై మాట్లాడుతూ.. అసలు నేరస్థులు దాక్కున్నారని, వివేకా హత్యలో అంతర్గత సంబంధాలపై అంశాలు ఉన్నట్లు పేర్కొన్నారు.. ఇక, కాశీబుగ్గ ఘటన, లారీ అక్సిడెంట్, బస్సు దుర్ఘటనలు లాంటి సంఘటనలపై ప్రభుత్వంపై విమర్శలు చేయడం తగదు అన్నారు.. అప్పులు, తప్పులు, పెద్ద గొప్పలు అయిపోయాయి.. వచ్చిన 11 సీట్లు కూడా రాకుండా చేసే బాధ్యత మాది అంటూ ఛాలెంజ్ చేశారు.
పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగినట్టుంది జగన్ పద్ధతి అంటూ ఎద్దేవా చేశారు ఆదినారాయణ రెడ్డి.. స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని ఎదుర్కోమని ఛాలెంజ్ చేశారు.. రైతులకు విత్తనాలు, ఎరువులు సప్లై జరుగుతోంది.. ఏ రంగంలో ఏం జరుగుతోందో కూడా జగన్‌కు తెలియదు.. వెయ్యి రోజుల్లో మేం చెప్పినవి జరగకపోతే మాకు 2029 ఎన్నికల్లో ఓటేయద్దని ప్రజలకు చెపుతున్నా అంటూ హాట్ కామెంట్లు చేశారు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి..
