NTV Telugu Site icon

Security Failure in YS Jagan Tour: కేంద్ర బలగాలతో జగన్‌కు రక్షణ కల్పించండి.. ప్రధాని మోడీ, అమిత్‌షాకు వైసీపీ లేఖ

Ycp

Ycp

Security Failure in YS Jagan Tour: వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి.. గుంటూరు మిర్చి యార్డ్‌ పర్యటనలో అడుగడునా భద్రతా వైఫ్యలం స్పష్టంగా కనిపించిందని వైసీపీ నేతలు ఫైర్‌ అవుతున్నారు.. అయితే, దీనిపై ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు వైయస్సార్సీపీ లోక్ సభ పక్ష నేత మిథున్ రెడ్డి.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కి కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు.. జగన్ కు రక్షణ కల్పించడంలో ఏపీ ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.. గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ పర్యటనకు వెళ్లిన జగన్‌కు పోలీసులు రక్షణ కల్పించలేదని దుయ్యబట్టారు.. జగన్ పర్యటనలు తీవ్రమైన భద్రత వైఫల్యం తలెత్తింది.. జెడ్ ప్లస్ సెక్యూరిటీ కేటగిరిలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు వెంటనే కేంద్ర బలగాలతో రక్షణ కల్పించండి అని విజ్ఞప్తి చేశారు..

Read Also: UP: శివరాత్రికి ముందు… తవ్వకాల్లో బయటపడ్డ శివలింగం

ఇటీవల వైఎస్ జగన్ నివాసం వద్ద కొన్ని ఘటనలు జరిగాయి అని ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్‌షా దృష్టికి లేఖ ద్వారా తీసుకెళ్లారు మిథున్‌రెడ్డి.. ఇవి భారీ ఎత్తున పన్నిన కుట్రలో భాగంగా జరుగుతున్న ఘటనలుగా ఆరోపించారు.. వైఎస్ జగన్ ప్రాణాలకు ముప్పు తెచ్చే విధంగా భద్రత వైఫల్యం కనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.. కూటమి ప్రభుత్వం విధానాల వల్ల మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రాణాలకు ముప్పు తెస్తున్నారు.. ప్రజాస్వామ్య విధానాలకు తూట్లు పొడిచేలా ప్రమాదకర ధోరణికి తెరలేపుతోందని కూటమి ప్రభుత్వం అంటూ.. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాకు రాసిన లేఖలో పేర్కొన్నారు వైసీపీ లోక్ సభ పక్ష నేత మిథున్ రెడ్డి. కాగా, ఇప్పటికే ఏపీ గవర్నర్‌ను కలిసిన వైసీపీ నేతలు.. వైఎస్‌ జగన్‌ గుంటూరు పర్యటనలో తగిన భద్రత కల్పించలేదని ఫిర్యాదు చేసిన విషయం విదితమే..