Site icon NTV Telugu

Minister Ram Prasad Reddy: ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణంపై మంత్రి ఏమన్నారంటే?

Minister Ramprasad Reddy

Minister Ramprasad Reddy

Minister Ram Prasad Reddy: తాము చెప్పినట్లుగానే అన్ని పనులూ చేస్తున్నామని ఏపీ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాం ప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణంపై మంత్రి స్పందించారు. ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం అంశంపై అధ్యయనం చేస్తామని.. ఇతర రాష్ట్రాల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అమలు తీరును పరిశీలిస్తామని మంత్రి వెల్లడించారు. వచ్చే నెల నుంచి అన్న క్యాంటీన్లను ప్రారంభిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉచితంగా ఇసుకను అందిస్తున్నామని చెప్పారు. రవాణా చెక్ పోస్టులను గత ప్రభుత్వం మూసేసిందని.. చెక్ పోస్టులను రీ-ఓపెన్ చేసే అంశంపై త్వరలోనే ఓ సమావేశం పెడతామని మంత్రి రాంప్రసాద్‌ రెడ్డి స్పష్టం చేశారు. చెక్ పోస్టులను తిరిగి తెరిచే విషయమై అధికారులతో సమావేశమై.. త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు.

Read Also: Andhra Pradesh: జీపీఎస్ జీవో, గెజిట్ వెనక్కి తీసుకోవడంపై ఉద్యోగుల హర్షం

Exit mobile version