NTV Telugu Site icon

MInister Payyavula Keshav: పోలవరం ఏ ఒక్క ప్రాంతానికో కాదు.. ఏపీ రైతాంగానికి గొప్ప వరం

Minister Payyavula Keshav

Minister Payyavula Keshav

MInister Payyavula Keshav: పోలవరం ఏ ఒక్క ప్రాంతానికో వరం కాదు.. రాష్ట్ర రైతాంగానికి ఇదో గొప్ప వరం అన్నారు ఏపీ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌.. కన్న తల్లికి దణ్ణం పెట్టలేని జగన్.. తల్లికి వందనం పథకం గురించి మాట్లాడటం విడ్డూరమని దుయ్యబట్టిన ఆయన.. 9 వేల మంది పోలవరం నిర్వాసితులకు దాదాపు వెయ్యి కోట్లు.. ఎన్ని ఆర్ధిక ఇబ్బందులు ఉన్నా, సీఎం చంద్రబాబు నాయుడు సూచనలతో విడుదల చేశాం అన్నారు. ఎన్నో ఇతర ప్రాధాన్యాలు పక్కన పెట్టి మరీ పోలవరం నిర్వాసితులకు పరిహారం చెల్లించాం.. వచ్చిన 5 నెలల్లోనే మేం పోలవరం కోసం చేసిన దానిలో 5 శాతమైనా జగన్ పోలవరం నిర్మాణానికి చేశారా ? అని నిలదీశారు.. పోలవరం ముంపు గ్రామాలు వరద ముంపునకు గురైనప్పుడు నిర్వాసితుల బాధలు సీఎం చంద్రబాబు కళ్లారా చూశారని పేర్కొన్నారు..

Read Also: Amit Shah: ప్రజల సొమ్ముతో కేజ్రీవాల్‌ విలాసాలు.. అమిత్ షా విమర్శలు

రాయలసీమ భూ భాగoలో పట్టిసీమ తర్వాత గణనీయ మార్పులు వచ్చాయి అన్నారు మంత్రి పయ్యావుల.. రైతు కష్టాలు తీరుస్తూ ధాన్యం కొనుగోళ్లు చేసిన 24 గంటల్లోనే నిధులు జమ చేస్తున్నాం అని స్పష్టం చేశారు.. ప్రాజెక్టుల్లో నీళ్లు నింపి రైతుల జీవితాల్లో వెలుగులు చూస్తున్నాం అన్నారు. రాష్ట్రంలో ఏదో జరిగిపోతొందనే ఆతృత వైఎస్‌ జగన్ కు అనవసరం అని సెటైర్లు వేశారు.. అనర్హుల పేరిట రాష్ట్రవ్యాప్తంగా ఫింఛన్ల తొలిగింపు అని జరుగుతున్న ప్రచారం జగన్ శ్రేణులు సృష్టించిందేనంటూ మండిపడ్డారు ఏపీ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌..

Show comments