NTV Telugu Site icon

AP Assembly: భారీ నీటి ప్రాజెక్ట్‌లకు రూ.15,513 కోట్లు.. చిన్న ప్రాజెక్టులకు రూ.1,227 కోట్లు..

Nimmala Ramanaidu

Nimmala Ramanaidu

AP Assembly: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి.. అయితే, అసెంబ్లీలో కీలక తీర్మానం చేశారు మంత్రి నిమ్మల రామానాయుడు.. 2024-25 సంవత్సరానికి ఇరిగేషన్ ప్రాజెక్టులకు నిధుల కేటాయంపుపై అసెంబ్లీలో నోట్ ఆన్ డిమాండ్స్ ప్రవేశపెట్టారు మంత్రి నిమ్మల రామానాయుడు.. భారీ, మధ్య తరహా ప్రాజెక్ట్ లకు 15,513 కోట్ల రూపాయలు కేటాయింపు కోరుతూ తీర్మానం ప్రవేశపెట్టారు నిమ్మల.. అలాగే చిన్న నీటి తరహా ప్రాజెక్టులకు 1,227 కోట్ల రూపాయల నిధులు కేటాయంపు కోరుతూ మరో తీర్మానం ప్రవేశపెట్టారు.. ఇక, టిడ్కో ఇళ్ళ నిర్మాణాలపై శాసన సభలో చర్చ కొనసాగుతోంది..

Read Also: Allergy: అలర్జీలు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు

మరోవైపు.. జలవనరులు శాఖ మంత్రి రామానాయుడుతో రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్‌రెడ్డి భేటీ అయ్యారు.. రాయచోటి నియోజకవర్గ నీటి సమస్యలపై చర్చించారు.. శ్రీనివాసపురం, అడవిపల్లె రిజర్వాయర్ బ్యాలెన్స్ పనులు పూర్తికి 156 కోట్లు మంజూరు చేయాలని కోరారు మంత్రి రాంప్రసాద్‌రెడ్డి.. కాగా, ఈ రోజు శాసన సభ సమావేశాలు ప్రారంభం కాగానే సభలో సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు.. ఏపీ శాసనసభ మాజీ సభ్యులు కెంబూరి రామ్మోహనరావు, పాలపర్తి డేవిడ్ రాజు, రుద్రరాజు సత్యనారాయణ రాజు, అడుసుమిల్లి జయప్రకాష్, శ్రీమతి మాగుంట పార్వతమ్మ మరియు శ్రీ రెడ్డి సత్యనారాయణ మరియు మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మృతి పట్ల తీవ్ర విచారాన్ని వ్యక్తం చేస్తూ సంతాప తీర్మానం పెట్టారు.. మృతులకు సంతాపంగా రెండు నిముషాల మౌనం పాటించింది అసెంబ్లీ..