Minister Narayana: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్రంలో టిడ్కో ఇళ్ల పరిస్థితిపై పలువురు ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మంత్రి పొంగూరు నారాయణ.. వచ్చే జూన్ నెలాఖరులోపు 2,61,640 టిడ్కో ఇళ్లను పూర్తి చేసేలా ముందుకెళ్తున్నాం అని ప్రకటించిన ఆయన.. ఎక్కడైనా పూర్తయిన ఇళ్లను ప్రతి శనివారం లబ్దిదారులకు అప్పగించాలని మున్సిపల్ కమిషనర్లకు ఆదేశాలిచ్చాం అన్నారు.. మొత్తం ఇళ్ల నిర్మాణంతో పాటు మౌళిక వసతులకు, కాంట్రాక్టర్ల పెండింగ్ బకాయిలకు కలిపి రూ.7,280 కోట్లు అవసరం.. ఈ నిధులను హడ్కో ద్వారా, వివిధ బ్యాంకుల నుంచి లోన్ లు సేకరిస్తున్నాం అన్నారు.
Read Also: 200MP టెలిఫోటో కెమెరా, 7,000mAh బ్యాటరీలతో వచ్చేస్తున్న Realme GT 8 Series!
2014-19 లో కేంద్ర ప్రభుత్వం 7,01,481 టిడ్కో ఇళ్లను ఏపీకి కేటాయించింది.. వీటిలో 5 లక్షల ఇళ్ల నిర్మాణానికి పాలనా అనుమతులు తీసుకుని టెండర్లు పిలిచాం అన్నారు మంత్రి నారాయణ.. అయితే, గత ప్రభుత్వం వీటిని 2,61,640 కు తగ్గించడమే కాకుండా… ఇళ్లను కూడా పూర్తి చేయలేదని ఆరోపించారు.. అంటే మొత్తంగా 4,39,841 ఇళ్లను రద్దు చేసేసింది అని మండిపడ్డారు.. గత ప్రభుత్వం టిడ్కో ఇళ్లలో అనేక అవకతవకలకు పాల్పడింది.. 39,520 మంది లబ్దిదారులకు అర్హత లేదని పక్కన పెట్టేసిందని మండిపడ్డారు.. ఇళ్లకు పార్టీ రంగులు వేసి కాంట్రాక్టర్లకు బిల్లులు కూడా ఇవ్వలేదని విమర్శించారు.. ఇళ్లు ఇవ్వకుండానే లబ్ధిదారుల పేరుమీద బ్యాంకు లోన్ లు తీసుకుంది.. ఈ లోన్ లు చెల్లించేందుకు ఈ ప్రభుత్వం 140 కోట్ల రూపాయాలు బ్యాంకులకు చెల్లించిందని వివరించారు మంత్రి పొంగూరు నారాయణ..
