Site icon NTV Telugu

TDR Bonds: టీడీఆర్‌ బాండ్లపై కీలక ఆదేశాలు.. అవి మినహా మిగతావి రిలీజ్..

Minister Narayana

Minister Narayana

TDR Bonds: టీడీఆర్ బాండ్లపై కీల‌క ఆదేశాలు జారీ చేసిన మంత్రి నారాయ‌ణ‌.. మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్లు, యూడీఏల అధికారుల‌తో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించిన ఆయన.. ఈ రాత్రిలోగా వెరిఫికేష‌న్ పూర్తయి పెండింగ్‌లో ఉన్న అన్నిబాండ్లను ల‌బ్ధిదారుల‌కు అందించాల‌ని ఆదేశాలు జారీ చేశారు.. ఆన్‌లైన్‌లో బాండ్లను జారీ చేయాల‌ని ఆదేశించారు.. రాష్ట్రంలో కూట‌మి ప్రభుత్వం ఏర్పడిన త‌ర్వాత కొత్తగా వ‌చ్చిన టీడీఆర్ ద‌ర‌ఖాస్తుల‌ను రెండు రోజుల్లోగా ప‌రిష్కరించాల‌ని స్పష్టం చేశారు.. ఇక, గ‌త వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వంలో ప‌లు మున్సిపాల్టీల్లో టీడీఆర్ బాండ్లలో భారీ అక్రమాలు జరిగాయని ఆరోపించారు.. అక్రమాలు జ‌రిగిన చోట క‌మిటీలు వేసి ప్రభుత్వం స‌మస్యలు పరిష్కరిస్తోందని స్పష్టం చేశారు.. గ‌త ప్రభుత్వంలో అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగిన బాండ్ల విష‌యంలో మిన‌హా మిగ‌తా బాండ్లను రిలీజ్ చేయాల‌ని ఆదేశాలు జారీ చేశారు మంత్రి నారాయణ..

Read Also: Delhi Assembly Polls: అతిషిపై అల్కా లాంబాను బరిలోకి దింపిన కాంగ్రెస్

Exit mobile version