Site icon NTV Telugu

Minister Narayana: టిడ్కో ఇళ్లపై క్లారిటీ ఇచ్చిన మంత్రి..

Minister Narayana

Minister Narayana

Minister Narayana: టిడ్కో ఇళ్లపై అసెంబ్లీ వేదికగా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు మంత్రి నారాయణ.. అసెంబ్లీలో టిడ్కో ఇళ్లపై క్వశ్చన్ అవర్‌లో సభ్యులు ప్రశ్నలు వేశారు.. బ్యాంక్‌ లోన్ కట్టలేక లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారన్న ఆవేదిన వ్యక్తం చేశారు సభ్యులు మాధవి రెడ్డి.. కొండబాబు.. సింధూర రెడ్డి.. జోగేశ్వర రావు.. లబ్ధిదారులకు వెంటనే టిడ్కో ఇళ్లు ఇవ్వాలని సభ్యులు కోరారు.. వడ్డీలు కట్టలేక.. అటు అద్దె ఇళ్లల్లో ఉండలేక ఇబ్బందులు పరిష్కరించాలని కోరారు.. ఇక, సభ్యుల ప్రశ్నలకు సమాధానమిచ్చిన మంత్రి నారాయణ.. టిడ్కో ఇళ్లపై క్లారిటీ ఇచ్చారు.

Read Also: Aamir Khan : బాలీవుడ్ పడిపోవడానికి కారణం ఇదే..

7 లక్షలకు పైగా ఇళ్లు టిడ్కోలో మంజూరు అయ్యాయి. 4 లక్షలకు పైగా ఇళ్లకు టెండర్లు పిలిచాం.. వాటిలో గత ప్రభుత్వం కొన్ని ఇళ్లు రద్దు చేసిందని మండిపడ్డారు మంత్రి నారాయణ.. కేవలం గత ప్రభుత్వం 57 వేల ఇళ్ల నిర్మాణం చేసింది.. టిడ్కో ఇళ్లలో మంచి సౌకర్యాలు ఉన్నాయి. రోడ్లు. పార్కులు. స్కూళ్లు.. షాపింగ్ కాంప్లెక్స్ ఇలా అన్ని సౌకర్యాలు ఉన్నాయి. అప్పట్లో సీఎం చంద్రబాబు టిడ్కో ఇళ్ల దగ్గర ఎకనామిక్ ఆక్టివిటీ ఉండాలన్నారు.. 2 ఎకరాలు టిడ్కో ఇళ్ల కాంప్లెక్స్ దగ్గర ఉంచితే అది కూడా గత ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని విమర్శించారు. గత ప్రభుత్వానికి ప్లానింగ్ లేదు.. ఇల్లు ఇవ్వకుండానే లోన్ తీసుకున్నారు. 77 వేల మందిపై గత ప్రభుత్వం లోన్ తీసుకుని ఇళ్లు ఇవ్వలేదు.. ప్రస్తుతం ప్రభుత్వం 140 కోట్లు బాంక్ లోన్ కట్టాలి. కొన్ని ఇళ్లను రద్దు చేసి వేరేవారికి గత ప్రభుత్వం ఇచ్చింది. వీటికి సంబంధించి కూడా మార్పులు చేస్తాం అన్నారు మంత్రి నారాయణ..

Exit mobile version