Nara Lokesh: విజయనగరం జిల్లాలో ఓ హెచ్‌ఎం విద్యార్థులకు స్టేజ్ పై నుంచి సాష్టాంగ నమస్కారం చేసి గుంజీలు తీసి.. క్షమాపణలు చెప్పిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.. దీనిపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించారు.. “విజయనగరం జిల్లా, బొబ్బిలి మండలం, పెంట జెడ్పీ హైస్కూల్ హెడ్మాస్టర్ చింత రమణ గారు పిల్లల విద్యా పురోగతి అంతంతమాత్రంగా ఉందని, చెప్పిన మాట వినడంలేదని.. విద్యార్థులను దండించకుండా, గుంజీలు తీసిన వీడియో సోషల్ మీడియా ద్వారా నా దృష్టికి వచ్చింది. హెడ్మాస్టరు గారూ! అంతా కలిసి పనిచేసి, ప్రోత్సాహం అందిస్తే మన ప్రభుత్వ పాఠశాలల పిల్లలు అద్భుతాలు సృష్టిస్తారు. వారిని దండించకుండా అర్థం చేసుకునేలా మీ స్వీయక్రమశిక్షణ చర్య ఆలోచన బాగుంది, అభినందనలు. అందరం కలిసి విద్యాప్రమాణాలు పెంచుదాం. పిల్లల విద్య, శారీరక, మానసిక వికాసానికి కృషిచేసి, వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేద్దాం..” అంటూ ట్వీట్ చేశారు మంత్రి నారా లోకేష్..
Read Also: Urvashi Rautela : రికార్డ్ సాధించిన బాలయ్య బ్యూటీ..!
కాగా, విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం పెంటగ్రామలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు రమణ ఆవేదన ఇప్పుడు వైరల్‌గా మారిపోయిన విషయం విదితమే.. పిల్లలు ఏమీ చదవడం లేదని.. అక్షరం ముక్క కూడా రావట్లేదని ఆవేదన వ్యక్తం చేసిన ఆ ప్రభుత్వ టీచర్.. మీకు మేము ఏమీ చేయలేకపోతున్నందుకు నాకు నేనుశిక్షించుకుంటున్నానంటూ.. పిల్లలను క్షమాపణ కోరుతూ మేం ఏమి చేయలేం నిస్సహాయ స్థితిలో ఉన్నామని పేర్కొన్నారు.. ప్రస్తుత రోజుల్లో పిల్లలకు చదువు రాకపోతే వాళ్లకి బుద్ధి నేర్పే పద్ధతిలో మేం చెప్తే మా పైన అధికారులు, తల్లిదండ్రులు చర్యలు తీసుకుంటున్నారు.. మేం ఏమి చేయాలో తోచడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.. మమ్మల్ని క్షమించండి అంటూ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు దండం పెట్టారు.. స్టేజ్‌పై గుంజీలు తీశారు.. మీకు మేం ఏమీ చేయలేకపోతున్నందుకే ఈ విధంగా గుంజీలు తీసున్నానని పేర్కొన్నారు.. మేం కొట్టలేం.. తిట్టలేం.. ఏమీ చేయలేం.. మీ దగ్గర చేతకాని వారిలాగా చేతులు కట్టుకుని ఉండాల్సిన పరిస్థితి వచ్చింది.. అంటూ ఆ హెచ్‌ఎం చేసిన వ్యాఖ్యలు.. ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతూ.. వైరల్‌గా మారిపోగా.. వెంటనే ఆ వీడియోపై మంత్రి నారా లోకేష్ స్పందించారు.
విజయనగరం జిల్లా, బొబ్బిలి మండలం, పెంట జెడ్పీ హైస్కూల్ హెడ్మాస్టర్ చింత రమణ గారు పిల్లల విద్యా పురోగతి అంతంతమాత్రంగా ఉందని, చెప్పిన మాట వినడంలేదని….విద్యార్థులను దండించకుండా, గుంజీలు తీసిన వీడియో సోషల్ మీడియా ద్వారా నా దృష్టికి వచ్చింది. హెడ్మాస్టరు గారూ!… pic.twitter.com/Se7zu6uwf5
— Lokesh Nara (@naralokesh) March 13, 2025