Site icon NTV Telugu

Nara Lokesh: రాజీనామా చేస్తా.. వైఎస్ జగన్కు మంత్రి లోకేష్ సవాల్

Nara Lokesh

Nara Lokesh

Nara Lokesh: వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఎక్స్ (ట్విట్టర్) ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. మీరు చేసిన ఆరోపణలు నిరూపిస్తే నేను నా మంత్రి పదవికి రాజీనామా చేస్తాను అని వెల్లడించారు. మీరు చేసిన ఆరోపణలు తప్పని తేలితే రాష్ట్ర యువతకు క్షమాపణ చెప్పండి చాలు అని పేర్కొన్నారు. ఆరోపణలు చేయడం, పారిపోవడం జగన్ రెడ్డికి కొత్తేమీ కాదు అని సెటైర్లు వేశారు. ఉర్సా కంపెనీకి విశాఖపట్నంలో ఎకరం భూమిని రూపాయికే కట్టబెట్టారు అంటూ మీరు తీవ్ర ఆరోపణ చేశారు.. నేను స్పష్టంగా మరోసారి చెబుతున్నా.. ఉర్సా కంపెనీకి విశాఖలోని ఐటీ పార్క్ హిల్ – 3లో ఎకరం కోటి రూపాయలు చొప్పున మూడున్నర ఎకరాలు కేటాయించాం అని మంత్రి నారా లోకేష్ వెల్లడించారు.

Read Also: Sajjala Ramakrishna Reddy: జూన్ 4న వెన్నుపోటు దినం కార్యక్రమం.. అడ్డుకుంటే కోర్టుకు పోదాం..

ఇక, కాపులుప్పాడలో ఎకరం యాభై లక్షల రూపాయల చొప్పున 56.36 ఎకరాలు కేటాయించాం అని మంత్రి లోకేష్ తెలిపారు. బురదజల్లి ప్యాలస్ లో దాక్కోవడం కాదు.. చేసిన ఆరోపణలు నిరూపించండి అంటూ సవాల్ చేశారు. నా ఛాలెంజ్ కు సిద్ధమా జగన్ రెడ్డి గారు?.. మీ ఐదేళ్ల విధ్వంస పాలనలో ఒక్క కంపెనీ తీసుకురాకపోగా ఉన్న కంపెనీలను ఇతర రాష్ట్రాలకు తరిమేశారు అని మండిపడ్డారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తరువాత 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పెట్టుకొని పని చేస్తున్నాం.. పెద్ద ఎత్తున పెట్టుబడులను రాబడుతున్నాం.. కంపెనీలు రావడం, యువతకు ఉద్యోగ అవకాశాలు రావడం చూసి మీరు తట్టుకోలేకపోతున్నారు.. ఈనో వాడండి కాస్త రిలీఫ్ వస్తుంది అని నారా లోకేష్ ఎద్దేవా చేశారు.

Exit mobile version