NTV Telugu Site icon

Minister Lokesh met Sales Force President: సేల్స్ ఫోర్స్ ప్రెసిడెంట్‌లో లోకేష్‌ భేటీ..

Lokesh Met Sales Force Pres

Lokesh Met Sales Force Pres

Minister Lokesh met Sales Force President: ఏపీలో పెట్టుబడులే లక్ష్యంగా రాష్ట్ర విద్య, ఐటి ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అమెరికాలో పర్యటిస్తున్నారు.. ఇప్పటికే పలు కీలక సంస్థలు, పారిశ్రామిక వేత్తలతో సమావేశమైన ఆయన.. రాష్ట్రంలో ఉన్న వనరులు, ప్రభుత్వం ఇస్తున్న రాయితీలు, పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరిస్తూ.. పెట్టుబడి పెట్టాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు.. ఇక, శాన్ ఫ్రాన్సిస్కో లో సేల్స్ ఫోర్స్ ప్రెసిడెంట్ శ్రీని తల్లాప్రగడ, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ రమేష్ రాగినేనితో నారా లోకేష్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులకు గల అవకాశాలను మంత్రి వారికి వివరించారు. సేల్స్ ఫోర్స్ కార్యకలాపాల గురించి వివరిస్తూ… సేల్స్‌ఫోర్స్ కంపెనీ కస్టమర్ రిలేషన్‌షిప్ మేనేజ్‌మెంట్ (CRM) , క్లౌడ్-ఆధారిత సొల్యూషన్స్‌లో గ్లోబల్ లీడర్ గా ఉందని.. కస్టమర్ ఇంటరాక్షన్‌లు, సేల్స్ అండ్ సర్వీస్ ఆపరేషన్లను నిర్వహించడానికి సాధికారత కల్పించే సాధనాలను సరఫరా చేస్తుందన్నారు..

Read Also: Nayanthara : ‘బియాండ్ ది ఫెయిరీ టైల్’.. బుల్లితెరపై లేడీ సూప‌ర్ స్టార్ ప‌ర్సనల్ లైఫ్

ఇక, సేల్స్ ఫోర్స్ యొక్క కస్టమర్ 360, ఐన్ స్టీన్ ఏఐ వంటి ఆవిష్కరణలు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యాన్ని పొందాయి. క్లౌడ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్, క్లౌడ్ కంప్యూటింగ్, అప్ డేటేడ్ అప్లికేషన్లలో సేల్స్ ఫోర్స్ పురోభివృద్ధి సాధిస్తోంది. ఈ ఏడాది అక్టోబర్ నాటికి సేల్స్ ఫోర్స్ మార్కెట్ క్యాప్ $224.14 బిలియన్ డాలర్లు ఉండగా, ఆదాయం $36.46 బిలియన్ డాలర్లుగా నమోదైందని సేల్స్ ఫోర్స్ ప్రెసిడెంట్ శ్రీని తల్లాప్రగడ, వైస్ ప్రెసిడెంట్ రమేష్ రాగినేని లోకేష్‌ టీమ్‌కు వివరించారు.. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. ఈ-గవర్నెన్స్, పబ్లిక్ సెక్టార్ లలో ఏఐ, క్లౌడ్ టెక్నాలజీలను సమర్థవంతంగా వినియోగించాలన్నది మా లక్ష్యం. రాష్ట్రవ్యాప్తంగా CRM సొల్యూషన్‌లు, ఏఐ-డ్రైవెన్ పబ్లిక్ సర్వీసెస్, స్మార్ట్ సిటీ కార్యక్రమాలను అమలు చేయడానికి సేల్స్‌ఫోర్స్ సహకారాన్ని కోరుతున్నాం. డాటా సేవల రంగానికి అనువైన వాతావరణ కలిగిన విశాఖపట్నంలో ఆర్ అండ్ డీ సెంటర్ ను ఏర్పాటుచేయండి. గ్లోబల్ టెక్ హబ్‌గా మారబోతున్న ఏపీలో సేల్స్‌ఫోర్స్ క్లౌడ్ ప్లాట్‌ఫారమ్‌లు, ఏఐ సొల్యూషన్లను సమగ్రపరచడం వంటి సేవలు మాకు ఉపకరిస్తాయి. ఏపీలో పెట్టుబడులు పెట్టే అంశాన్ని పరిశీలించాలని కోరారు.