Minister Nara Lokesh: ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల వేళ.. ఆ కోటాలో పదవి పొందేందుకు చాలా మంది నేతలు ప్రయత్నాలు సాగించారు.. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌ని కలిసి.. విన్నవించుకున్నారు.. అయితే, ఉన్నది ఐదు సీట్లు మాత్రమే.. అందులో జనసేన, బీజేపీకి చెరో సీటు కేటాయించిన తర్వాత.. మిగిలిన మూడు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది టీడీపీ.. దీంతో, కొన్ని ప్రాంతాల్లో ఆందోళన జరిగినట్టు తెలుస్తోంది.. టికెట్ ఆశించి భంగపడిన నేతలు కొందరు అసహనం వ్యక్తం చేస్తుండగా.. మరికొందరు మాత్రం.. పార్టీ అధినేతపై నమ్మకాన్ని ప్రకటిస్తారు.. ఈ తరుణంలో.. మీడియా చిట్‌చాట్‌లో కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి నారా లోకేష్.. ఎమ్మెల్సీలుగా బలహీనవర్గాలకు ప్రాతినిధ్యం కల్పించాం.. బలహీనవర్గాలపై టీడీపీకి ఉన్న చిత్తశుద్ధిని మరోసారి చాటాం అన్నారు లోకేష్..
Read Also: CM Chandrababu: పథకాలు అమలు, కార్యక్రమాల నిర్వహణపై సీఎం కీలక సమీక్ష
ఇక, యువ మహిళలను ప్రోత్సహించాలని గ్రీష్మకు అవకాశం ఇచ్చామని వెల్లడించారు మంత్రి నారా లోకేష్.. మరోవైపు, పార్టీ కోసం కష్టపడిన వారందరికీ పదవులు వస్తాయి అని భరోసా కల్పించే ప్రయత్నం చేశారు.. పదవులు రాలేదని ఎవరూ ఆందోళన చెందవద్దు అని సూచించారు. ఇక, టీచర్ల సమస్యలను క్రమపద్దతిలో పరిష్కరించాం. అంగన్వాడీలకు సంబంధించిన 4 సమస్యల పరిష్కరించామని మీడియా చిట్‌చాట్‌లో పేర్కొన్నారు మంత్రి నారా లోకేష్.. కాగా, అసెంబ్లీ కమిటీ హాల్ లో నామినేషన్లు దాఖలు చేశారు టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు కావలి గ్రీష్మ, బీటీ నాయుడు, బీదా రవిచంద్ర.. ఈ కార్యక్రమంలో మంత్రులు నారా లోకేష్, అచ్చెంనాయుడు, కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.