Minister Nara Lokesh: ప్రభుత్వం.. ప్రజలు కలిస్తేనే… సీఐఐ సదస్సు అన్నారు మంత్రి నారా లోకేష్.. నిన్న మహిళా క్రికెట్ ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ చూసేందుకు ముంబై వెళ్లిన ఆయన.. ఫైనల్ మ్యాచ్ సందర్భంగా చాలా మంది పారిశ్రామిక వేత్తలను కలిశాను. ఏపీలో ఏదో మ్యాజిక్ జరుగుతోంది అంటున్నారు.. గూగుల్ ఏపీకి తీసుకెళ్లారు..? ఎలా సాధ్యం..? అని అడిగారని తెలిపారు.. మా హయాంలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చాం.. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు పోటీపడి పనిచేస్తున్నాం.. యువతకు ఉపాధి కల్పిస్తే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయన్నారు.. 16 నెలల్లో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ముందుకొచ్చాయి.. పెట్టుబడుల ఆకర్షణకు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానం తీసుకొచ్చాం.. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వల్ల పోటీపడి పెట్టుబడులు సాధిస్తున్నాం అన్నారు.
Read Also: Private Colleges : రేపటి నుండి పరీక్షలు బంద్.. ప్రభుత్వం దిగిరావాల్సిందే..!
అనకాపల్లిలో ఆర్సెల్లార్ మిత్తల్ రూ.1.5 లక్షల కోట్ల పెట్టుబడులు పెడుతోంది.. విశాఖలో గూగుల్ 15 బిలియన్ డాలర్ల పెట్టుబడిని పెడుతోంది.. దేశ ఎఫ్‌డీఐ చరిత్రలో అతిపెద్ద పెట్టుబడి గూగుల్ పెడుతోందని వెల్లడించారు నారా లోకేష్.. నెల్లూరులో బీపీసీఎల్ రూ.లక్ష కోట్ల పెట్టుబడులు పెడుతోంది అన్నారు.. ఎన్‌టీపీసీ రూ.1.60 లక్షల కోట్ల పెట్టుబడులు పెడుతోంది.. స్వదేశీ పెట్టుబడుల సాధనలో ఏపీ ప్రథమస్థానంలో ఉంది.. అనుభవం, సమర్థ నాయకత్వం ఉన్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని అభివర్ణించారు. ఆర్సెల్లార్ మిత్తల్ పెట్టుబడుల కోసం ప్రధానిని చంద్రబాబు రెండుసార్లు కలిశారు.. నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖలో సీఐఐ సమ్మిట్ నిర్వహిస్తున్నాం. సీఐఐ సమ్మిట్‌కు పలువురు కేంద్రమంత్రులు, పారిశ్రామికవేత్తలు వస్తున్నారు.. సీఐఐ సమ్మిట్‌కు 45 దేశాల నుంచి 300 మంది పారిశ్రామికవేత్తలు వస్తున్నారు. ఇన్వెస్టర్లు, ప్రభుత్వం, ప్రజలు కలిస్తేనే ఏపీని అగ్రస్థానంలో నిలబెట్టగలం.. 120 బిలియన్ డాలర్ల పెట్టుబడులతో ఆగిపోవట్లేదు.. ఇంకా సాధించాలి అన్నారు మంత్రి నారా లోకేష్..
