Minister Nara Lokesh: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి దావోస్ వెళ్లిన రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ బిజీ బిజీగా గడుపుతున్నారు.. ఓవైపు సీఎం చంద్రబాబుతో కలిసి వివిధ సంస్థల భేటీల్లో పాల్గొంటున్న ఆయన.. మరోవైపు.. అవకాశం దొరికొనప్పుడు ఇతర సంస్థలతో కూడా సమావేశాలు నిర్వహిస్తున్నారు.. నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ మాథ్యూ ఉక్ చాంగ్ తో లోకేష్ భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ లోని విశ్వవిద్యాలయాలతో కలసి పరిశోధనా కార్యక్రమాలకు సహకరించమని కోరారు.. వ్యవసాయం, బయోటెక్నాలజీ, ఇతర స్థిరమైన పద్ధతులకు సంబంధించిన ప్రాజెక్టులపై సహకారం అందించాలన్నారు లోకేష్.. ఏపీ విశ్వవిద్యాలయాలతో కలసి రాష్ట్రంలో ఉమ్మడి పరిశోధన ప్రయోగశాలలను ఏర్పాటు చేయమన్నారు. స్థానిక పరిశోధకులు, విద్యార్థుల కోసం సింథటిక్ బయాలజీలో శిక్షణ కార్యక్రమాలు, వర్క్‌షాప్‌లను నిర్వహించాలని సూచించారు.. స్థానిక బయోటెక్ కంపెనీలు, NCEB భాగస్వామి నెట్‌వర్క్ మధ్య సహకారాన్ని సులభతరం చేయాలని.. ఏపీ మెడ్‌టెక్ జోన్‌కు సమీపంలోఇన్నొవేషన్ హబ్, ఆర్ అండ్ డీ క్లస్టర్‌ను ఏర్పాటు చేయడానికి నాలెడ్జ్ సపోర్ట్ అందించాలని మంత్రి లోకేష్ కోరారు..
Read Also: Vikram : ఆగిపోయిన సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన విక్రమ్..
ఇక, స్విట్జర్లాండ్ నేషనల్ కౌన్సిల్ మెంబర్ నికలస్ శామ్యూల్ గగ్గర్ తో నారా లోకేష్ దావోస్ బెల్వడేర్ లో భేటీ అయ్యారు. స్విట్జర్లాండ్ వాణిజ్య సంబంధాలను బలోపేతం చేసుకోవాలని భావిస్తున్నాం అన్నారు.. ఏపీలో నెస్లే, రొషే, నోవార్టిస్, ఎబిబి, క్లారియంట్, హిల్టీ, బుచర్, ఎస్ టీ టెలిమీడియా, ఓసీ ఒర్లికా వంటి స్విస్ కంపెనీలు కార్యకలాపాలు ప్రారంభించేలా ఆహ్వానించేందుకు ఆసక్తితో ఉన్నాం అన్నారు.. వస్త్రాలు, యంత్రాల తయారీ, హార్డ్‌వేర్, ఎలక్ట్రానిక్స్, రైలు, రైలు భాగాల విడిభాగాల తయారీ, ఫార్మాస్యూటికల్స్, వైద్య పరికరాల తయారీ, ఆర్ అండ్ డీ హబ్‌ల ఏర్పాటుకు సహకారం అందించాలన్నారు.. ఏపీ, స్విస్ విశ్వవిద్యాలయాలతో కలసి పనిచేయడానికి సహకారం అవసరమని.. ఏఐ, ఫార్మా, మెడికల్ డివైస్, స్టార్ట్-అప్‌లు, ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్‌లలో ఏపీ, స్విట్జర్లాండ్‌లోని విశ్వవిద్యాలయాలను కనెక్ట్ చేయడంలో మద్దతు అవసరమన్నారు మంత్రి లోకేష్.. ఏపీలో స్విస్ కంపెనీల కార్యకలాపాలకు తమవంతు సహకారాన్ని అందిస్తానని చెప్పారు సంస్థ ప్రతినిధులు.
Read Also: Nandamuri Balakrishna : ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయే చిత్రం ‘డాకు మహారాజ్’
మరోవైపు ఎయిర్ ఇండియా మేనేజింగ్ డైరక్టర్, సీఈవో క్యాంప్ బెల్ విల్సన్ తో మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. రాష్ట్రంలోని ఏడు ఆపరేషనల్ ఎయిర్ పోర్టుల ద్వారా ఈ ఏడాది 52 లక్షల ప్యాసింజర్ ట్రాఫిక్ సాధించామన్నారు.. విశాఖపట్నం విమానాశ్రయంలో ప్రాంతీయ మెయింటెనెన్స్, రిపేర్స్, ఓవర్ హాల్ హబ్ ను ఏర్పాటు చేయాలన్నారు.. ఈ సదుపాయం కల్పించడం వల్ల స్థానిక ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందడమేగాక ఎయిరిండియా కార్యాచరణ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుతుందన్నారు లోకేష్.. ప్రతిపాదిత హబ్ తో ఉపాధి అవకాశాలు లభిస్తాయని.. అనుబంధ పరిశ్రమల అభివృద్ధికి ప్రోత్సాహం లభిస్తుందిన్నారు. విమానయానరంగంలో ఆంధ్రప్రదేశ్ స్థానాన్ని బలోపేతం చేస్తుందని.. సీఆర్డీఏ పరిధిలో దుబాయ్ తరహాలో 3 వేల నుంచి 5వేల ఎకరాల్లో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటుచేయాలన్నారు లోకేష్.. ఇక్కడ ఎయిర్ పోర్టు ఏర్పాటు చేస్తే గ్లోబల్ యావియేషన్ లో కీలకపాత్ర వహించడమేగాక ఏపీకి అంతర్జాతీయ ట్రాఫిక్, పెట్టుబడులు లభిస్తాయన్నారు . ఆంధ్రప్రదేశ్‌లో పైలట్లు/ స్టీవార్డెస్/ టెక్నికల్ టీం కోసం శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విజ్ఞప్తులపై డైరక్టర్ల బోర్డులో చర్చించి నిర్ణయం తీసుకుంటామని సంస్థ ప్రతినిధులు తెలిపారు.