Site icon NTV Telugu

Minister Nara Lokesh: ఆ ఏడుగురు ఎమ్మెల్యేల తీరు సరికాదు.. మంత్రి లోకేష్‌ ఆగ్రహం..

Nara Lokesh

Nara Lokesh

Minister Nara Lokesh: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్‌ సమావేశం జరిగింది.. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది.. అయితే, కేబినెట్‌ భేటీకి ముందు మంత్రులతో ప్రత్యేకంగా కొన్ని అంశాలను ప్రస్తావించారు మంత్రి నారా లోకేష్.. మంత్రివర్గ భేటీకి ముందు ఎమ్మెల్యేల వివాదస్పద ఘటనలపై మంత్రులతో చర్చించారు.. ముఖ్యంగా దగ్గుబాటి ప్రసాద్, కూన రవి, బుడ్డా రాజశేఖర్ రెడ్డి, నజీర్ అహ్మద్ అంశాలను ప్రస్తావించారట.. మరోవైపు, రౌడీషీటర్‌ శ్రీకాంత్‍కు పెరోల్ సిఫార్సు చేసిన కోటంరెడ్డి, సునీల్ అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చాయట.. అనంతపురం, శ్రీశైలం ఎమ్మెల్యేలు సహా ఏడుగురి తీరు సరికాదని హితవు చెప్పారట లోకేష్‌.. టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఆ ఏడుగురు ఎమ్మెల్యేల వ్యవహారశైలిపై ఆగ్రహంతో ఉన్నారని మంత్రులకు తెలిపారు లోకేష్.. ఇక, పెరోల్ విషయాల్లో ఎమ్మెల్యేలు సిఫార్సు చేస్తే ఆచితూచి వ్యవహరించాలని హోమంత్రి వంగలపూడి అనితకు సూచించారట లోకేష్.. మరోవైపు, దివ్యాంగుల పింఛన్ల తొలగింపుపై ఫిర్యాదులను లోకేశ్ దృష్టికి తీసుకెళ్లారు మంత్రులు.. అర్హులు నష్టపోకుండా పింఛన్లు ఇచ్చేలా చర్యలు తీసుకుందామని మంత్రులకు తెలియజేశారు మంత్రి నారా లోకేష్‌.

Read Also: Star Hospitals: సీనియర్ సిటిజెన్స్ కోసం స్టార్ సమ్మాన్ ప్రారంభం..

Exit mobile version