NTV Telugu Site icon

Minister Nara Lokesh: పాదయాత్రలో రెడ్ బుక్ గురించి ఎవరూ పట్టించుకోలేదు.. కానీ..!

Lokesh

Lokesh

Minister Nara Lokesh: పాదయాత్రలో రెడ్ బుక్ గురించి నేను మాట్లాడితే ఎవరూ పట్టించుకోలేదు అన్నారు మంత్రి నారా లోకేష్.. జ్యూరిక్‌లోని తెలుగువారితో సీఎం చంద్రబాబు ‘మీట్‌ అండ్‌ గ్రీట్’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పిలవగానే ఇంత మంది వస్తారని తాను ఊహించలేదు.. ఇక్కడి తెలుగు పారిశ్రామికవేత్తలను చూస్తుంటే.. జ్యూరిక్‌లో ఉన్నామా..? లేక జువ్వలపాలెంలో ఉన్నామా అర్థం కావడం లేదంటూ చమత్కరించారు. ఇక, తెలుగు జాతి సత్తా ప్రపంచానికి తెలియజేసిన వ్యక్తి సీఎం చంద్రబాబు నాయుడు.. ఆయన.. చేతిలో ఫైళ్లు పట్టుకొని న్యూయార్క్‌ వీధుల్లో తిరిగారు. ఆనాడు ఆయన విజన్-2020 అంటే ఎంతో మంది ఎగతాళి చేశారని పేర్కొన్నారు.. కేవలం రాజకీయాలే కాదు.. వ్యాపార రంగాల్లోనూ అనుభవం ఉన్న వ్యక్తి చంద్రబాబు.. ఆయన మూడు సంస్థలు పెట్టి విఫలమైనా.. ఏమాత్రం అధైర్యపడకుండా పట్టుదలతో నాలుగో సంస్థగా హెరిటేజ్‌ను స్థాపించారు.. అనుకున్నది సాధించారని పేర్కొన్నారు..

Read Also: Minister Nimmala Ramanaidu: 20 లక్షల ఉద్యోగాలు అందించేందుకు సంకల్పించాం..

ఇక, రాష్ట్ర పునఃనిర్మాణం కోసం మన శక్తిని పెట్టాలన్నారు లోకేష్.. ఏపీలో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి.. ప్రాధాన్యత క్రమంలో పెట్టుకుని.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లించడానికే చాలా కష్టపడాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు.. అప్పులపాలయ్యం.. వడ్డిలు కట్టలేకపోతున్నాం.. జీతాలు చెల్లించలేకపోతున్నాం.. ఇలా చాలా ఇబ్బందులు పడుతున్నాం అన్నారు.. తెలుగు వాళ్లు.. రాష్ట్రాన్ని వదిలేసి బాగుపడ్డారు.. కానీ, రాష్ట్రం వెనుకబడింది.. ఇప్పుడంతా సహాయం చేయండి.. ఐదేళ్లలో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిద్దాం.. ఏపీ పునర్నిర్మాణం కోసం అంతా కలిసి పనిచేయాలి. మీ సహకారం, తోడ్పాటు రాష్ట్రానికి అవసరం. రానున్న ఐదేళ్లలో ఏపీ అంటే ఏమిటో ప్రపంచానికి చూపించాలనుకుంటున్నాం అన్నారు.. విదేశాల్లో ఉన్న తెలుగువారి ఫీడ్‌ బ్యాక్‌ మాకు చాలా అవసరం, అభివృద్ధి పరంగా.. రాజకీయంగా కూడా మీ సలహాలు అవసరం అన్నారు.. చాలా మంది దగ్గర నా వాట్సాప్‌ నంబర్‌ ఉంది.. నాకు ఫీడ్‌ ఇవ్వొచ్చు అన్నారు.. ఇక, పాదయాత్రలో రెడ్‌బుక్‌ గురించి ఎవరూ పట్టించుకోలేదన్నా నారా లోకేష్‌.. చట్టాన్ని ఉల్లంఘించి ప్రజలను ఇబ్బంది పెట్టిన వారిని వదిలిపెట్టేది లేదని చెప్పాను.. ఇప్పటికే మొదలైది.. పూర్తి చేయాల్సిన బాధ్యత కూడా తీసుకుంటాం అన్నారు.. కానీ, రాజకీయ కక్షలు ఉండవని స్పష్టం చేశారు మంత్రి నారా లోకేష్‌..