NTV Telugu Site icon

Minister Ramprasad Reddy: గుడ్‌న్యూస్ చెప్పిన మంత్రి.. స్పోర్ట్స్ కోటాలో రిజర్వేషన్‌ పెంపు..

Minister Ramprasad Reddy

Minister Ramprasad Reddy

Minister Ramprasad Reddy: స్పోర్ట్స్‌ కోటాలో రిజర్వేషన్‌ పెంపుపై ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ వేదికగా శుభావార్త చెప్పారు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి.. స్పోర్ట్స్ కో రిజర్వేషన్‌ 2 శాతం నుండి 3 శాతానికి పెంచనున్నట్టు వెల్లడించారు.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో 2047 విజన్ తో గ్లోబల్ హబ్ గా ఆంధ్రప్రదేశ్ క్రీడా విధానం మారుతుందని తెలిపారు.. స్పోర్ట్స్ కోటాలో 2 శాతం నుండి 3 శాతానికి రిజర్వేషన్ పెంచుతాం.. ఒలంపిక్స్, ఆసియా క్రీడల్లో పతకాలు గెలిచిన వారికి ఉద్యోగ అవకాశాల అర్హత కల్పిస్తామని పేర్కొన్నారు.. శాప్ లో గ్రేడ్ -3 కోచ్ ల కోసం అంతర్జాతీయంగా పథకాలు సాధించిన వారికి 50 శాతం రిజర్వేషన్ ఉంటుందన్నారు.. పారా స్పోర్ట్స్ తో పాటు Deaf స్పోర్ట్స్, Blind స్పోర్ట్స్ ద్వారా డిజిటల్ సర్టిఫికెట్స్ జార చేయనున్నట్టు తెలిపారు.

Read Also: Kerala High Court: సీఎంకు నల్లజెండా చూపించడం చట్ట విరుద్ధం కాదు..

ఇక, క్రీడా దినోత్సవం రోజున స్వర్ణాంధ్ర క్రీడా బిరుదులు ప్రదానం చేస్తామన్నారు మంత్రి రాంప్రసాద్‌రెడ్డి.. గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు క్రీడా మైదానాలు ఏర్పాటు చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యంగా పేర్కొన్నారు.. రాష్ర్టంలో స్పోర్ట్స్ టూరిజాన్ని అభివృద్ది చేస్తున్నాం.. రాష్ర్టంలో అంతర్జాతీయ, జాతీయ క్రీడ పోటీలను పెద్ద ఎత్తున నిర్వహించడానికి సన్నాహాలు చేస్తాం.. PPP భాగస్వామ్యంతో క్రీడా రంగానికి మౌళికసదుపాయాలు కల్పిస్తాం.. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సారథ్యంలో రాష్ట్రంలో ఉన్న 85 లక్షల విద్యార్థులకు విద్యతో పాటు క్రీడలు అందుబాటులో ఉండే విధంగా ప్రణాళికబద్ధంగా కొనసాగుతాం అని వెల్లడించారు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి.