NTV Telugu Site icon

AP Cabinet Decisions: ఏపీ కేబినెట్‌ కీలక నిర్ణయాలు.. వీటికి గ్రీన్‌ సిగ్నల్‌..

Kolusu Parthasarathy

Kolusu Parthasarathy

AP Cabinet Decisions: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.. సమావేశం ముగిసిన తర్వాత కేబినెట్‌ నిర్ణయాలను మీడియాకు వివరించారు మంత్రి కొలుసు పార్థసారథి.. రాష్ట్ర ఆర్ధిక స్ధితి మెరుగు పరచడానికి కావాల్సిన పాలసీలు ఆమోదించారు.. గ్లోబల్ కాంపిటీటివ్ సెంటర్స్ పాలసీని కేబినెట్ ఆమోదించింది.. రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితి, ఎకానమీ, స్కిల్డ్ వర్క్ ఫోర్స్ అభివృద్ధి కి గ్లోబల్ కాంపిటీటివ్ సెంటర్స్ పాలసీ ఉపయోగపడుతుందన్నారు.. ఒక కుటుంబానికి ఒక పారిశ్రామికవేత్త ఆలోచన సీఎం చంద్రబాబుదన్న ఆయన.. MNCలలో పని చేస్తున్నారు చాలామంది… కానీ, ఇళ్ళవద్దే పని చేస్తున్నారు.. కోవర్కింగ్ స్పేస్ డెవలప్ చేస్తే.. వారికి ఇన్సెంటివ్ ఇస్తాం అన్నారు.. నైబర్ హుడ్ వర్కింగ్ స్పేస్ ను కూడా డెవలప్ చేయచ్చు.. కోవర్కింగ్ స్పేస్ డెవలపర్స్ కి 50 శాతం కాస్ట్ లో సబ్సిడీ ఇస్తాం.. సీటుకు 2000 రూపాయలు ఇన్సెంటివ్ ఇవ్వడం జరుగుతుందన్నారు.. గ్రామాలలో 1000 స్క్వేర్ ఫీట్ లో కోవర్కింగ్ స్పేస్ ఉంటే వారికి 1000 రూపాయలు ఓ సీటుకు ఇస్తాం,, ఐటీ క్యాంపస్ ఏర్పాటు చేస్తే 50 శాతం కేపిటల్ సబ్సిడీ ఇస్తాం.. రాష్ట్రాన్ని ఐటీ హబ్ గా అభివృద్ధి చేయాలి… యువతకు ఉపాధి భరోసా కల్పించడానికి ఈ పాలసీ అని స్పష్టం చేశారు..

Read Also: Vitamin ‘D’ Deficiency: ‘విటమిన్ డి’ లోపం ఉంటే ఇవి తినండి.. మళ్లీ సమస్య రాదు..

ఇక, అపారల్ & గార్మెంట్స్ పాలసీ ని కూడా కేబినెట్ ఆమోదించింది అని వెల్లడించారు మంత్రి పార్థసారథి.. వచ్చే ఐదేళ్లలో 10 వేల కోట్ల పెట్టుబడి, 6 లక్షల ఉద్యోగాలు తేవాలని ఆలోచన,, PPP మోడ్ లో 5 టెక్స్ టైల్ పార్కులు ఏర్పాటు చేస్తాం,, ఏపీ మేరీటైం పాలసీని కూడా కేబినెట్ ఆమోదించిందని తెలిపారు.. పోర్టులు, పోర్టు ఆధారిత పరిశ్రమలు అభివృద్ధి చేసి మేరిటైం హబ్ గా తీర్చిదిద్దాలని నిర్ణయం.. పోర్టుల ద్వారా రవాణా 450 మిలియన్ టన్నులు గుజరాత్ చేస్తుంటే.. ఏపీ 180 టన్నులు చేస్తోందన్నారు.. షిప్ బిల్డింగ్ పరిశ్రమను కూడా అభివృద్ధి చేయాలని ఏపీ ప్రభుత్వం ఆలోచన.. సీఎం చంద్రబాబు మెగా షిప్ యార్డు తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు.. మూడు త్రాగునీటి ప్రాజెక్టులు ఆలస్యం కావడంతో, ప్రాజెక్టులు పూర్తి చేసే అవకాశం లేకపోయింది.. పులివెందుల, డోన్ నియోజకవర్గాలలో మంచినీటి ప్రాజెక్టులు, ఉద్దానం ప్రాంతంలో ఒక ప్రాజెక్టు పూర్తి కాలేదన్ఆనరు.. గత ప్రభుత్వం క్రూరమైన ఆలోచనతో ప్రాజెక్టులు నాశనం చేశారని మండిపడ్డారు.. గత ప్రభుత్వం విధ్వంసకర ఆలోచనలతో రాష్ట్రానికి అన్యాయం చేసిందన్నారు..

Read Also: MLA Sticker : ఓడి ఏడాదైనా ఎమ్మెల్యే స్టికర్‌ తీయని ఎమ్మెల్యే..

అయితే, PMAY అర్బన్, గ్రామీణ్, వన్ మన్ లలో పూర్తికాని ప్రాజెక్టులు పూర్తి చేస్తాం అని ప్రకటించారు పార్థసారథి.. 26 మార్చి వరకూ ఈ ఇళ్ళను పూర్తి చేయడానికి వరకూ కేంద్రం సమయం ఇచ్చింది.. అర్బన్, గ్రామీణ్ కలిపి 9.31 లక్షల ఇళ్ళు పూర్తవ్వాల్సి ఉంది.. పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా నిర్ణయం తీసుకున్నాం.. మెడికల్ ప్రాక్టీషనర్స్ యాక్టు అనుగుణంగా బోర్డు.. ఏపీ స్టేట్ మెడికల్ కౌన్సిల్ ఫర్ ఇండియన్ సిస్టంగా ఆయుర్వేద బోర్డుని మార్చడం జరిగింది.. ఏపీ స్పోర్ట్స్ పాలసీని కేబినెట్ ఆమోదించింది.. ఎలక్ట్రికల్ వాహనాలు కొనే వారికి సబ్సిడీ ఇస్తాం.. ఎలక్ట్రిక్ వాహనాల పాలసీని ఆమోదించిందని తెలిపారు. వాట్సప్ ద్వారానే అన్ని సర్టిఫికేట్ లు మీకు అందించేలా చర్యలు తీసుకోబోతున్నాం అన్నారు.. ఇక, పొట్టి శ్రీరాములు పేరిటి 15 డిసెంబర్‌ నాడు ఆయన సంస్మరణ దినంగా చేయాలని నిర్ణయించాం.. పొట్టి శ్రీరాములు నివాసాన్ని మ్యూజియంగా చేయాలని నిర్ణయించాం అన్నారు.. మిషన్ భగీరధ అని పక్క రాష్ట్రం చేస్తే, రాష్ట్ర వాటా తీసుకురావడంలో కూడా గత ప్రభుత్వం విఫలం అయ్యారు.. జలజీవన్ మిషన్ ను పూర్తిగా చేస్తాం అని వెల్లడించారు మంత్రి మంత్రి కొలుసు పార్థసారథి..

Show comments