NTV Telugu Site icon

TDP Office Attack Case: టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసు.. మరోసారి వైసీపీ నేతలకు పోలీసుల నోటీసులు

Tdp

Tdp

TDP Office Attack Case: తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడి కేసులో.. మరోసారి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలకు నోటీసులు జారీ చేశారు మంగళగిరి రూరల్‌ పోలీసులు.. ఈ కేసులో ఇప్పటికే వైసీపీ నేతలకు సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చిన నేపథ్యంలో, విచారణకు సహకరించాలని వైసీపీ నాయకులకు షరతు పెట్టింది.. ఈ నేపథ్యంలో వైసీపీ కీలక నేతలకు మరోసారి నోటీసులు జారీ చేశారు పోలీసులు.. టీడీపీ కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడి కేసులో ఈ రోజు విచారణ చేయనున్నారు పోలీసులు.. అందులో భాగంగానే ఈ రోజు మధ్యాహ్నం విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.. అయితే మధ్యాహ్నం వైసీపీ నేతలు విచారణకు వస్తారా..? లేక మరో రోజు వస్తారా..? అనేది ఉత్కంఠగా మారింది..

Read Also: Tamil Nadu CM: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌పై సీఎం ఎంకే స్టాలిన్ సీరియస్..

కాగా, టీడీపీ కార్యాలయంలపై దాడి కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ముందస్తు బెయిల్ ను నిరాకరించడంతో.. సుప్రీంకోర్టును ఆశ్రయించారు వైసీపీ నేత దేవినేని అవినాష్, మాజీ మంత్రి జోగి రమేష్ సహా పలువరు వైసీపీ నేతలు.. వైసీపీ నేతల తరఫున సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు కపిల్ సిబాల్.. ఇక, ఏపీ ప్రభుత్వం తరఫున ముకుల్ రోహిత్గి , సిద్ధార్థ లూత్రా తమ వాదనలను సుప్రీంకోర్టులో వినిపించారు.. అయితే, దేవినేని అవినాష్, జోగి రమేష్ లకు రక్షణ కల్పించాలని సూచించింది సూప్రీంకోర్టు.. ఇదే సమయంలో ఈ కేసు విచారణకు సహకరించాలని పేర్కొంది.. పాస్‌పోర్ట్‌ను హ్యాండోవర్‌ చేయాలని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు.. దేవినేని అవినాష్‌, జోగి రమేష్‌తో పాటు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాంకు మధ్యంతర రక్షణ కల్పించాలని సూచించింది సుప్రీంకోర్టు.. పాస్‌పోర్టులను 48 గంటల్లో అప్పగించాలని సూచించింది.. నలుగురు విచారణకు పూర్తిగా సహకరించాలని పేర్కొంది.. ఇక, కేసు తదుపరి విచారణ నవంబర్ 4వ తేదీకి వాయిదా వేసిన విషయం విదితమే. కానీ, ఆ వెంటనే మంగళగిరి పోలీసులు నోటీసులు జారీ చేయడం చర్చగా మారింది.