Chittoor Elephant Attack: చిత్తూ రు జిల్లా కుప్పంలో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించింది.. ఏనుగుల దాడిలో ఒకరు మృ తి చెందారు.. కుప్పం మండల పరిధిలోని కుర్మానిపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది.. మృతుడు కిట్టప్పగా గుర్తించారు అధికారులు.. రాగి పంటకు కాపలా ఉన్న కిట్టప్పపై ఏనుగు లు దాడి చేశాయి.. దీంతో, ఏనుగుల భయంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.. అయితే, ఈ ఘటనపై స్పందించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు..
Read Also: Mega158 : చిరంజీవి – కొల్లి బాబీ సినిమాలోకి టాప్ టెక్నీషియన్ జాయిన్..
అటవీ ప్రాంతాలను ఆనుకొని ఉన్న గ్రామాలలోకి ఏనుగులు ప్రవేశించే పరిస్థితులు ఉత్పన్నయ్యే అవకాశాలు ఉన్నప్పుడు ముందస్తు హెచ్చరికలు చేసే ప్రక్రియను మరింత పెంచాలని అధికారులకు ఆదేశించారు పవన్ కల్యాణ్.. కుప్పం మండలంలోని వెంకటేశ్వరపురం గ్రామంలో కిట్టయ్య అనే వ్యక్తి ఏనుగు దాడిలో మరణించిన ఘటన డిప్యూటీ సీఎం దృష్టికి వచ్చింది.. పి.సి.సి.ఎఫ్., సంబంధిత అధికారులతో గురువారం ఉదయం ఈ ఘటనపై చర్చించారు. కిట్టయ్య కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియచేశారు. ఆ కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయాన్ని సత్వరమే అందించాలని స్పష్టం చేశారు. తమిళనాడు అటవీ ప్రాంతం వైపు నుంచి వచ్చిన ఏనుగు మూలంగా ఈ ఘటన చోటు చేసుకొందని, అక్కడ కూడా సదరు ఏనుగు మూలంగా మరణాలు సంభవించాయని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు అటవీ శాఖ అధికారులు వివరించారు. మన రాష్ట్ర అటవీ ప్రాంతంలోకి వస్తోందని ట్రాక్ చేసిన వెంటనే సమీప గ్రామాల వారికి ముందుగానే తెలియచేశామన్నారు. అయితే, ముందస్తు హెచ్చరికలను మరింత విస్తృతం చేయండి.. గ్రామాలవారీగానూ, రైతులతోనూ సోషల్ మీడియా గ్రూప్స్ ఏర్పాటు చేసి వాటికి టెక్స్ట్ మెసేజిలతోపాటు, వాయిస్ మెసేజిలు కూడా పంపిస్తే సమాచారం తొందరగా చేరుతుందని సూచించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..
