NTV Telugu Site icon

Low pressure in Bay of Bengal: బంగాళాఖాతంలో అంచనాలకు భిన్నంగా కదులుతోన్న అల్ప పీడనం..!

Rain Alert

Rain Alert

Low pressure in Bay of Bengal: వాతావరణ శాఖ అంచనాలకు భిన్నంగా బంగాళాఖాతంలో అల్ప పీడనం కదులుతోంది. ప్రస్తుతం దక్షిణ కోస్తా, ఉత్తర తమిళనాడు సమీపాన తీవ్ర అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. ఇది రానున్న 24 గంటల్లో పశ్చిమ నైరుతిగా పయనించి దక్షిణ కోస్తా తీరం వైపు వచ్చే క్రమంలో బల హీనపడుతుందని అంచనాలు వున్నాయి. ఇక, తీవ్ర అల్పపీడనం కారణంతో బలమైన ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. వారం రోజులకు పైగా వదలకుండా… విడవ కుండా వున్న ముసురు రైతులకు ముప్పుగా మారింది. ఇవాళ దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలకు ఆస్కారం వుంది. కోస్తాలో చలి తీవ్రత కొనసాగుతోంది. రానున్న 24 గంటల్లో కోస్తాలోని అనేక ప్రాంతాలు, రాయలసీమలోని పలుచోట్ల వర్గాలు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీవర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. ఈ అల్పపీడనం కాస్త బలహీనపడుతున్న దశలో మరోటి ఏర్పడే అవకాశం వుంది. ఇటీవల కాలంలో బంగాళాఖాతంలో డిసెంబర్ నెలలో వరుస అల్పపీడనాలు ఏర్పడటం ఇదే తొలిసారి.

Read Also: Amaravati Railway Line: అమరావతికి రైల్వే లైన్‌.. ఫోకస్‌ పెట్టిన ఏపీ సర్కార్‌..

Show comments