NTV Telugu Site icon

Liquor Shops Closed: మందుబాబులకు బ్యాడ్‌ న్యూస్‌.. మద్యం షాపులు మూత.. 10 రోజులు పస్తులేనా..?

Liquor Shops Closed

Liquor Shops Closed

Liquor Shops Closed: మందుబాబులకు బ్యాడ్‌న్యూస్‌.. ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రవ్యాప్తంగా మద్యంషాపులు మూతపడ్డాయి.. నిన్నటితో వైన్‌ షాపుల్లో కాంట్రాక్టు ఉద్యోగుల కాంట్రాక్టు కాలం పూర్తి అయ్యింది.. అయితే, మరో 10 రోజులు వైన్‌ షాపులు తెరవాలని కోరింది ఏపీ ప్రభుత్వం.. కానీ, పది రోజుల తర్వాత తమ ఉద్యోగాలు ఉండవని, ప్రైవేట్ వైన్ షాప్స్ వస్తాయి కాబట్టి.. ఇవాళ నుంచి విధుల్లోకి రాలేదు సిబ్బంది.. దీనితో రాష్ట్ర వ్యాప్తంగా చాలా వరకు మద్యం షాపులు తెరుచుకోలేదు.. రాష్ట్ర వ్యాప్తంగా 3,240 వైన్‌ షాపులు మూతబడ్డాయి.. దీంతో.. వైన్‌ షాపులు తెరుచుకోకపోవడంతో.. మద్యం కావాలంటే మందు బాబులు బార్లకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది.. సాధారణంగా.. వైన్‌ షాపులు.. బార్లలో మద్యం ధరల్లో తేడా ఉండడంతో.. ఇప్పుడు మద్యం మరింత ప్రియం అయినట్టు అయ్యింది.. కాగా, ఈ నెల 12న కొత్త మద్యం పాలసీ ప్రకారం కొత్త మద్యం షాపులు ఓపెన్‌ కానున్న విషయం విదితమే..

Read Also: Komatireddy Venkat Reddy: మూసి ప్రక్షాళనను అడ్డుకుంటే ప్రత్యేక ఉద్యమం చేస్తాం..

ఇక, ఏపీ నూతన మద్యం పాలసీ నోటిఫికేషన్ జారీ చేసింది ప్రభుత్వం.. గత ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రభుత్వ మద్యం షాపుల విధానానికి స్వస్తి చెప్పాలని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది.. ప్రభుత్వ మద్యం షాపులు మూతపడి.. ఈ నెల 12వ తేదీ నుండి ప్రైవేటు మద్యం షాపులు అందుబాటులోకి రానున్నాయి.. కొత్త మద్యం షాపులకు నోటిఫికేషన్‌ జారీ కావడంతో.. నేటి నుంచి ఈ నెల 9వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.. 11న 3,396 షాపులకు లాటరీ తీస్తారు.. దరఖాస్తు రుసుము 2 లక్షల రూపాయలుగా నిర్ణయించింది ఎక్సైజ్‌ శాఖ.. లైసెన్స్‌ ఫీజులు 50 నుంచి 85 లక్షలు.. రెండేళ్ల కాల పరిమితితో నూతన మద్యం పాలసీకి ఎక్సైజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి ఎంకే మీనా సోమవారం నోటిఫికేషన్‌ విడుదల చేశారు.. అందుకు అనుగుణంగా మంగళవారం ఉదయం జిల్లాల్లో ఎక్సైజ్‌ అధికారులు షాపులను నోటిఫై చేస్తూ గెజిట్‌లు జారీ చేశారు.. ఈ రోజు ఉదయం 11 గంటల నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం అయ్యింది.. దరఖాస్తులను ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ రెండు విధానాల్లోనూ చేసుకునే వెసులుబాటు ఇచ్చింది ఏపీ ఎక్సైజ్‌ శాఖ..

Show comments