AP Liquor Shop Tenders 2024: మద్యం షాపులకు మందకోడిగా టెండర్లు.. ప్రభుత్వం కీలక ఆదేశాలు..
- ఏపీలో మద్యం షాపులకు మందకోడిగా టెండర్లు..
- ఏపీలో 3396 మంద్య షాపులకు టెండర్లు పిలిచిన ప్రభుత్వం..
- ఆరు రోజుల వ్యవధిలో 8274 టెండర్లు మాత్రమే దాఖలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Liquor Shop Tenders 2024: ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన ప్రభుత్వ మద్యం షాపులను తొలగిస్తూ నిర్ణయం తీసుకున్న కూటమి ప్రభుత్వం.. ప్రైవేట్ మద్యం షాపులకు టెండర్లు పిలిచింది.. అయితే, ఏపీలో మద్యం షాపులకు మందకోడిగా దాఖలవుతున్నాయి టెండర్లు. ఆరు రోజుల వ్యవధిలో 3,396 షాపులకు గానూ కేవలం 8,274 టెండర్లే దాఖలు అయ్యాయి.. స్టేట్ యావరేజ్ లెక్కల ప్రకారం ఒక్కో మద్యం షాపునకు 2-3 టెండర్లు మాత్రమే వచ్చాయంటోంది ఏపీ ఎక్సైజ్ శాఖ. భారీ ఎత్తున సిండికేట్లు ఏర్పడడంతో ప్రభుత్వ అంచనాలకంటే తక్కువగా మద్యం టెండర్లు వస్తున్నట్టు అంచనావేస్తున్నారు.. మరో మూడు రోజుల్లో టెండర్ల దాఖలు గడవు ముగియనుంది.. ఇప్పటి వరకు అత్యధికంగా విజయనగరం జిల్లాలో 855 టెండర్లు దాఖలు కాగా.. అత్యల్పంగా మన్యం జిల్లాలో కేవలం 174 టెండర్లే దాఖలు చేశారు..
Read Also: Vasavi Matha: శరన్నవరాత్రి ఉత్సవాలలో రూ.6,66,66,666తో వాసవీ కన్యకాపరమేశ్వరి అలంకరణ
Also Read
- YSRCP 2nd Candidates List: ఏపీ స్థానిక ఎన్నికలు.. రెండో విడత అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. అభ్యర్థులు వీరే!
- AP Government Employees Holiday: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్.. వరుసగా 4 రోజుల సెలవులు.. ఉత్తర్వులు జారీ
- AP Government: భవన నిర్మాణదారులకు గుడ్న్యూస్.. మున్సిపల్ సేవల్లో కీలక మార్పులు..
- AP High Court: పుంగనూరు, రాయచోటి ఘటనలపై హైకోర్టులో విచారణ.. తీర్పు రిజర్వ్
ఇక, తిరుపతి, నెల్లూరు జిల్లాలో మద్యం టెండర్లల్లో సీన్ రివర్స్ చేస్తున్నారు బిడ్డర్లు. తిరుపతి జిల్లాలో 227 షాపులకు గానూ కేవలం 165 టెండర్లు మాత్రమే దాఖలు అయ్యాయి.. నెల్లూరు జిల్లాలో 182 షాపులకు 179 టెండర్లు మాత్రమే దాఖలు చేశారు.. తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో కొన్ని షాపులకు టెండర్లు వేసేందుకే అసలు ముందుకే రావడం లేదు.. ఎన్టీఆర్, విజయనగరం జిల్లాల్లో ఒక్కో మద్యం షాపునకు యావరేజీన 5-6 టెండర్లు, ఏలూరు జిల్లాలో 4-5 టెండర్లు దాఖలు అయ్యాయి.. ఈ నేపథ్యంలో.. ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది.. మద్యం టెండర్లల్లో సిండికేట్ కాకుండా చూసుకోవాలని కలెక్టర్లను ఆదేశించింది సర్కార్. ఈ మేరకు జిల్లా అధికారులకు ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ఎంకే మీనా సూచనలు చేశారు.. 15-20 వేల టెండర్లు వస్తాయని ఎక్సైజ్ శాఖ అంచనా వేయగా.. ఇప్పటి వరకు 9 వేలు కూడా దాటని పరిస్థితి ఉంది.. టెండర్లకు మరో మూడు రోజుల గడువు ఉండడంతో టెండర్లు ఎన్ని వస్తాయోనేది ఉత్కంఠగా మారింది.. కాగా, ఈ నెల 11 తేదీన ఉదయం 8 గంటలకు లాటరీ ద్వారా మద్యం షాపులను కేటాయించనున్నారు అధికారులు. ఏ జిల్లాకు ఆ జిల్లాల్లోనే లాటరీ తీయనున్నారు.
తాజావార్తలు
-
Off The Record: అదితి చుట్టూ ఉన్న సలహాదారులే ఈ పరిస్థితికి కారణమా..?
-
YSRCP 2nd Candidates List: ఏపీ స్థానిక ఎన్నికలు.. రెండో విడత అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. అభ్యర్థులు వీరే!
-
Story Board: ఎన్నికల్లో కూటమి కలిసికట్టుగా పని చేస్తుందా ?
-
Off The Record: ధర్మాన మంత్రాంగం.. వైసీపీలోకి గుండ ఫ్యామిలీ?
-
Off The Record: క్రాంతికి జనసేనలో నో ఛాన్స్?.. ముద్రగడ కుమార్తెపై సొంత పార్టీలో అసంతృప్తి!
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్తో పాటు రీచార్జ్పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!